Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 7:10 am Editor : Admin

కార్వంగా గ్రామంలో నూతన సిసి రోడ్ల శంకుస్థాపన




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

తెల్కపల్లి మండలం కార్వంగ గ్రామంలో నూతన సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్వంగ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలుగుతుందని అన్నారు.

అనంతరం పులిజాల నుండి కార్వంగ గ్రామం మధ్య ఉన్న వాగు కారణంగా రైతులు మరియు గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ఎమ్మెల్యే గారు, త్వరలోనే ఆ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.