కార్వంగా గ్రామంలో నూతన సిసి రోడ్ల శంకుస్థాపన
తెల్కపల్లి మండలం కార్వంగ గ్రామంలో నూతన సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్వంగ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలుగుతుందని అన్నారు. అనంతరం...