(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దోషులను వెంటనే అరెస్ట్ చేసి రిమైండ్ చేయాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య
ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాల పై దాడులు హత్యలు అత్యాచారాలు కులపరమైన దూషణలు తప్పడం లేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బి కే ఎం యు
జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రింట్ మీడియా మిత్రులకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ఆయన మాట్లాడారు
ఎవడు రాసిండు ఈ కుల విభజనొ కానీ యుగాలు గడిచిన తరాలు మారిన తలరాతలు మారినట్టుగా కులవిక్ష అంటరానితనం గ్రామాలలో పట్టిపీడిస్తున్నపరిస్థితి ఉందని దీనికి కారణం రాజ్యాంగపరమైన చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం అమలు చెయ్యడంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని ఆయన విమర్శించారు
తాడూరు మండలం కుమ్మెర గ్రామం నాగర్ కర్నూల్ జిల్లాలో బిసి రజక కులానికి చెందిన వారిని గుళ్లోనికి రానీయకపోవడం దూషించడం కొట్టడం దేవుని దర్శనం కావాలంటే పైకం చెల్లించాల్సిందే అని ఉకుంజారీ చేయడం అనేది కుల పిచ్చి గాళ్ళ అక్కడున్న అగ్రవర్ణ రెడ్డి సామాజిక వర్గం ఇలాంటి ఘటనలకు పాల్పడడం అనేది హేనమైన చర్య ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేయలేక రాజకీయ ఒత్తిడి లకు లోనైనా పోలీసు యంత్రాంగం కూడా ఇందులో దోషులుగా చూడాల్సిన అవసరం ఉన్నది అని ఆయన అన్నారు
దోషులపై sc st అట్రాసిటి చట్టం నమోదుచేయాలని మర్డర్ కేసు కూడా నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.
పసి పిల్ల అని చూడకుండా మదమెక్కిన కులమైకంతో కాలుతో తన్ని చంపడం అనేది రజా కార్ల జమాన గుర్తుకు వస్తుందిఇలాంటి ఘటనలు కొత్తేవి కావు కానీ కనికరం లేకుండా పసి పాపను కూడా కాలుతో తన్నిన కుల దురంకార అగ్రవర్ణ వ్యక్తులపై హత్యా నేరం కులవేక్ష అంటరానితనం మానవ హక్కుల ఉల్లంఘన అకారమైన దాడి ఇవన్నీ కూడా పరిగణములోకి తీసుకొని చట్టపరమైన సెక్షన్ల ద్వారా వారిని కఠినంగా శిక్షించాలి బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు దానితో పాటు ఆ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలు
అధికారులు అందరు కూడా ఈ ఘటనపై స్పందించాలి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం పరంగా వారిని ఆదుకొని దాడులకు పాల్పడ్డ వారిపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి తక్షణమే చర్యలు తీసుకోవాలి లేనియెడల కలిసి వచ్చే ప్రజా సంఘాలను రాజకీయ పార్టీలను అన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉంటుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు