నీ పుట్టుకకు చాకలి కావాలి…
నీ మైల బట్టలు ఎత్తి పారేయడానికి చాకలి కావాలి..
బాలింతగా ఉన్న నీ తల్లిని సాకడానికి చాకలి కావాలి…
నీ పెళ్ళికి మైలపోళ్ళు తీయడానికి చాకలి కావాలి…
నువ్వు తిన్న పళ్లెం కడగడానికి చాకలి కావాలి…
నీ మాసిన బట్టలు ఉతకడానికి చాకలి కావాలి…
వాటికి ఇస్త్రీ చేసి పదిమందిలో నీ గౌరవం పెంచడానికి చాకలి కావాలి….
నీ బిడ్డ పెద్ద మనిషి అయితే చాకలి కావాలి…
ఆఖరికి నువ్వు ఛ***స్తే నిన్ను ఊరేగించి ఊరవతల బొం**ద పెట్టి 11 రోజులు కర్మ కాండ జరిపే వరకూ చాకలి కావాలి రా….
నీ పుట్టుక నుండి చా****వు వరకూ నీకు మైల అంటకుండా, నిన్ను శుభ్రం చేసేది ఒక చాకలి వ్యక్తిరా…
ఆ చాకలి లేకపోతే నువ్వు భూమ్మీద శుభ్రంగా బతకలేని, నీ గబ్బుని నువ్వు శుభ్రం చేసుకోలేని చవటవిరా అగ్రకులహంకారి…
వాళ్ళు ఉండబట్టే నీ గబ్బు నీకు తెలియక అహకారం తలకెక్కి ప్రవర్తిస్తున్నావ్…
నీ అవసరం లేకపోయినా వాళ్ళు సంతోషంగా బతకగలరు, వాళ్ళే గనక లేకపోతే పుట్టుక నుండి చా***వు వరకూ నీ ఒళ్ళు ఇల్లు మొత్తం కంపు కంపేరా…