(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గుడిసెలు వేసుకున్న పేదవారందరికీ పట్టాలు ఇవ్వాలి
*గుడిసెల కాలనీలోమౌలిక సదుపాయాలు* *కల్పించాలి*
*సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్*
*కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా*
.చేవెళ్ల పట్టణంలో సర్వే నెంబరు 75 లోని నాలుగు ఎకరాల ప్రభుత్వ భూములు 2022 లో నియోజకవర్గంలోని నిరుపేదలందరూ కలిసి సిపిఐ జెండా పట్టుకొని గుడిసెలు వేసుకున్నారు నాలుగు సంవత్సరాలు అయినా నేటికీ పట్టాలు ఇవ్వలేదని వారందరికీ ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని
వారు నివాసం ఉండే గుడిసెల కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య డిమాండ్ చేశారు
శంకర్పల్లి మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 500 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారు కానీ స్థలాలు నేటికి చూపించలేదు చేవెళ్లలో పట్టాలు ఇవ్వాలి శంకర్పల్లిలో ఇండ్ల స్థలాలు చూపించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ చేవెళ్ల నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ నియోజకవర్గ ఇన్చార్జి కే రామస్వామి అధ్యక్షతన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు
ఈ ధర్నాలో సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం కాదు చిత్తశుద్ధి ఉంటే చేవెళ్ల పట్టణంలో పేదలు గుడిసెలు వేసుకొని నాలుగు సంవత్సరాలుగా ఇంటి స్థలం సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారందరికీ పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు
మోకిలా పొన్నగుట్ట తండాలో గిరిజన రైతుల భూములను ల్యాండ్ పోలింగ్లో తీసుకున్న ప్రభుత్వం వారికి కేటాయించాల్సిన 800 గజాల స్థలాన్ని ఇవ్వకుండా వీరి పేరుతో ఉన్న భూమికి సంబంధం లేని వ్యక్తులకు ఎంజాయ్మెంట్ సర్వేలో వారి పేర్లను చేర్చి ఒరిజినల్ గిరిజన రైతులకు అన్యాయం చేయడం తగదని తక్షణమే ఒరిజినల్ రైతుల పేర్లను జాబితాలో చేర్చి ఎనిమిది వందల గజాల స్థలాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు
ఈ ధర్నాలో సిపిఐ మాజీ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగ్ రావు సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు ధర్నాలో మాట్లాడారు
పేదలకు న్యాయం జరిగే వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం వడ్ల సత్యనారాయణ బాతరాజు నరసింహ సిపిఐ చేవెళ్ల మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి మొయినాబాద్ మండల కార్యదర్శి కే శ్రీనివాస్ శంకర్ పల్లి మండల కార్యదర్శి పి సుధీర్ జిల్లా సమితి సభ్యులు మంజుల సుధాకర్ గౌడ్ సక్రు నాయక్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు గుడిసెలు వేసుకున్న నిరుపేదలు సుమారు 200 మంది ఈ ధర్నాలో పాల్గొన్నారు