జాతీయ కబడ్డీ జట్టుకు పవన్ ఎంపిక
గన్నేరువరం, నేటి సత్యం, ఫిబ్రవరి 24:
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కబడ్డీ క్రీడాకారుడు రాపోలు పవన్ (తండ్రి) రవి తెలంగాణ రాష్ట్ర సీనియర్ కబడ్డీ జట్టుకు ఎంపికై అద్భుత విజయాన్ని సాధించారు. త్వరలో గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో ఆయన తెలంగాణ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
గ్రామ స్థాయి నుండి ఎదిగి, నేడు జాతీయ స్థాయి వేదికపై తన ప్రతిభను చాటేందుకు సిద్ధమైన పవన్ కు గ్రామ ప్రజలు మరియు క్రీడా అభిమానులు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. గన్నేరువరం గ్రామ క్రీడాకారుడు ఇలా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో రాణించడం గ్రామ ప్రజలందరికీ గర్వకారణమని, కబడ్డీ అంటేనే గన్నేరువరం, గన్నేరువరం అంటేనే కబడ్డీ అని సీనియర్ కబడ్డీ క్రీడాకారులు తెలిపారు.ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ ఇంత తొందరగా నేషనల్ సీనియర్ కబడ్డీకి సెలక్ట్ అవడం గర్వకారణం అని పవను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేష్, ఉపాధ్యక్షుడు సంపత్ రావు, జిల్లా అధ్యక్షుడు అమిత్ కుమార్, జిల్లా సెక్రెటరీ మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.