Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 February 2026, 4:00 pm Editor : Admin

కూల్చిన స్థలంలోనే ఇల్లు కట్టించి ఇవ్వాలి సిపిఐ టి.రామకృష్ణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఖమ్మం పట్టణంలో పేదల ఇండ్లను కూల్చిన స్థలంలోనే నిర్మించి ఇవ్వాలి.సిపిఐ రామకృష్ణ

నేటి సత్యం హైదరాబాద్ ఫిబ్రవరి 25

ఏళ్ల తరబడి పేదల నివాసం ఉంటున్న ఇండ్లను మరియు గుడిసెలను 15 వేల మంది పోలీసుల సహాయంతో కూల్చివేసిన రెవిన్యూ సిబ్బంది.

పత్రిక ప్రకటన. టి రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు విడుదల చేశారు.

పేద ప్రజలు కాయకష్టం చేసుకొని ఇల్లు నిర్మించుకున్న ప్రజలను బలవంతంగా ఇండ్లను ఖాళీ చేయించి కూల్చివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తెలంగాణ ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని అన్నారు

పేదలు నివాసమున్న స్థలం భూదాన భూమి.అది రెవిన్యూ భూమి కాదు కోర్టు పరిధిలో ఉంది అయినప్పటికీ పేదల ఇండ్లు కూల్చినారు పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏ మనని ప్రభుత్వాలు ఇప్పుడు ఆ భూములకు రేట్లు పెరగడంతో కోట్ల రూపాయలను దండుకోవచ్చని దురుద్దేశంతో పేద ప్రజల గూడును చితిమేసి ప్రజల భవిష్యత్తుపై వాళ్ళ ఎదుగుదలపై ఉక్కు పాదం మోపిన రేవంత్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని రామకృష్ణ అన్నారు