Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlog28న మెడికల్ మాఫియా పై సిపిఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు

28న మెడికల్ మాఫియా పై సిపిఐ రాష్ట్రవ్యాప్త నిరసనలు

ఈ నెల 28 న మెడికల్ మాఫియా పై సీపీఐ రాష్ర్ట వ్యాప్త నిరసనలు :

✊సీపీఐ రాష్ట్రకార్యదర్శి ఈశ్వరయ్య గుజ్జుల పిలుపు :

…..ఈ సందర్భంగా… స్పెషల్ స్టోరీ..!!

” వైద్యానికి రోగమొచ్చింది…” అన్నట్టు మనుషులకు రోగాలు వస్తే రోగాన్ని నయం చేయాల్సిన మందులే మరో ‘కొత్త రోగాన్ని ‘ తెచ్చి పెడుతుంటే ఇక రోగానికి దిక్కెవరు? మనిషికి మందులు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకం తోనే మందుల వల్ల చాలా రోగాలు నయమవుతాయి. అలాంటిది రాను రాను ఆ మందుల మీదనే నమ్మకం పోయే పరిస్తితి దాపురించింది. అసలు ఏవి నకిలీ మందులో, ఏవి నిఖార్సయిన మందులో అంతుబట్టని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నకిలీ మందుల వల్ల మనిషి ఆరోగ్యం పూర్తీగా దెబ్బతినడం మాత్రమే కాకుండా, ఒక్కోసారి మందులు వికటించి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా మనం చూశాం,విన్నాం కూడా! ఈ నకిలీ మందులు తయారీ కంపెనీ లకు కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడితే, వీటిని తిన్న రోగులకు మాత్రం ఎక్కడలేని కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఈ నకిలీ మందుల తయారీ వెనుక ఒక పెద్ద మెడికల్ మాఫీయానే ఉంది అనేది బహిరంగ సత్యం. ఈ మెడికల్ మాఫియా పై గతంలోనే వామపక్ష యువజన సమాఖ్య ( ఏ ఐ వై ఎఫ్) నాయకులు అనేక దఫాలుగా వివిధ రూపాలలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. అయినా ఎక్కడా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. విద్య, వైద్యం, ఉపాథి అనేటివి మనిషి ప్రాథమిక హక్కులు. కానీ, ఈనాడు ఆ హక్కులకే చిల్లులు పడుతున్నాయి. వాటిని పూడ్చాల్సిన పాలకులు పూడ్చకపోగా వాటిని మరింత పెద్దవి గా చేస్తున్నారు. ఇక వాటి గురించి ఎవరో ఒకరు గళం విప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నెల 28 న సీపీఐ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనల కు పిలుపునిస్తున్నట్టు సీపీఐ ప్రకటన చేసింది.ఈ తరుణంలోనే ఈ మెడికల్ మాఫియా పై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

….. దేశవ్యాప్తంగా 2025 నాటి గణాంకాల ప్రకారం మొత్తం ఆసుపత్రులు 70 వేలు ఉంటే..అందులో సగానికి పైగా మెజారిటీ గా ప్రైవేట్ ఆసుపత్రులు ( సుమారు 43 వేల నుండి 44 వేల వరకు) వున్నాయి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ డేటా ప్రకారం ఒక్క ఏపీ లోనే దాదాపు 900 ఆసుపత్రులు వున్నాయి. తెలంగాణలో అయితే 400 లకు పైగా వున్నాయి. ఇవికాక చిన్న చితక, గుర్తింపు లేనివీ కోకొల్లలు గా వున్నాయి. ఒకప్పుడు డాక్టర్ అంటే సేవకుడు. కానీ ఇప్పుడా పరిస్తితి లేదు. వైద్య విధ్య ను ఎప్పుడైతే మార్కెట్లో అమ్మకానికి పెట్టారో అప్పుడే వైద్యం అనేది ‘సేవ ‘ బదులు ‘ సరుకు ‘ ( డబ్బు) గా మారిపోయింది. వైద్య విధ్య ను లక్షలు పెట్టీ మరీ కొనుక్కుంటున్నారు. విద్య పూర్తి అయ్యేసరికి దాదాపు ఐదారు ఏళ్ళు పడుతుంది. ఈ లోపు దాదాపు కోటి దాకా ఖర్చవుతుంది. అంత పెట్టుపడి పెట్టిన తర్వాత వచ్చే లాభం ను మాత్రమే చూస్తాడుగానీ, చేయాల్సిన సేవను, వృత్తి ధర్మాన్ని చూడరు. దీనికంతటికీ కారణం వైధ్యాన్ని ప్రైవేటికరణ చేయడం. పోనీ, ప్రభుత్వరంగంలో నడిచే ఆసుపత్రుల్లో అయినా సరైన వైద్యం అందుతుందా అంటే అదీ లేదు. తగినంతమంది సిబ్బంది వుండరు. చాలా మందులు అందుబాటులో వుండవు. సరైన వసతులు వుండవు. ఒక వేళ అన్ని వసతులు వున్నా డాక్టర్ల కొరత, మందుల కొరతో ఏదో ఒకటి వుంటుంది. అన్నిటికంటే మరోవైపు నిర్లక్ష్య ధోరణి. ఈ కారణాలన్నీ కూడా పేషంట్ల ను ప్రయివేట్ ఆసుపత్రుల వైపు పరుగులు పెట్టిస్తాయి. దీన్ని ఆసరా చేసుకొనే మెడికల్ మాఫియా పుట్టుకొచ్చింది…!!

… . ..చాలా జబ్బులకు మందులు అవసరం లేదు :

సాధారణ జలుబు, దగ్గు,జ్వరం, వొళ్ళు నొప్పులు, తల నొప్పి, బీ పీ, షుగర్, గ్యాస్ ట్రబుల్, నడుం నొప్పి లాంటి వాటికి అసలు మందులే అవసరం లేదు అనేది కొందరు నిజాయితీ పరులైన డాక్టర్లు అంటున్నమాట ! సమయానికి తినడం, తక్కువగా బాగా నమిలి తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య పోతుంది. ఆహారాన్ని సమపాళ్లలో తీసుకొంటూ, పీచు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల, అదేవిధంగా ఉప్పును తక్కువగా తింటూ, గింజలను ఆహారంలో భాగం చేసుకుని తింటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బీపీ, షుగర్ గ్యాస్ ట్రబుల్ దాదాపు కంట్రోల్ లో వుంటాయి. మనకు వచ్చే దాదాపు సగం జబ్బులన్నీ తిండి, నీరు, గాలి ద్వారానే వస్తాయి. వీటిల్లో యెక్కువగా సహజసిద్ధమైన జబ్బులే అధికంగా వుంటాయి. సహజంగా వచ్చే జబ్బులు సహజంగానే వాటి అంతకు అవే వెళ్లిపోతాయి.కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే సరిపోతుంది. కానీ చాలా మంది డాక్టర్లు అవన్నీ చెప్పరు. అన్ని జబ్బులు అలాగనే పోతాయనేది చెప్పలేం. కానీ,అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేయడం,మందులు గుట్టలు గుట్టలు రాసివ్వడాన్ని మనం చూస్తున్నాం..వింటున్నాం. దీనికంతటికీ కారణం మెడికల్ మాఫియా నే. గుండె జబ్బులు,క్యాన్సర్ , బ్రెయిన్ లాంటి ప్రమాదకర జబ్బుల నుండి కోలుకోవడానికి తాత్కాలికంగా మందులతో కూడిన ట్రీట్ మెంట్ అవసరం కావచ్చు. కానీ, పూర్తి మందులతోనే జబ్బులు నయం అవుతాయనేది కూడా అవాస్తవం. అప్పుడప్పుడూ ఛాతీ దగ్గర ఇబ్బంది పెట్టే గ్యాస్ట్రిక్ సమస్యను గుండె జబ్బుగా చిత్రీకరించి ట్రిట్ మెంట్ చేసి అందిని కాడికి డబ్బులు గుంజుకొనే వారు కొందరైతే, ,ఒక్కోసారి సాధారణంగా బీపీ లో వచ్చే హెచ్చు తగ్గులు ను కూడా దీర్ఘకాలిక వ్యాధిగా చిత్రీకరించి రోజూ మందు బిళ్ళలు తినిపించే పరిస్థితిని కొందరు డాక్టర్లు కల్పిస్తుండటం విచారకరం. అవసరానికి మించి మందులు వాడడం వల్ల రోగం తాత్కాలికంగా నయం కావచ్చునేమో గానీ, ఆ రసాయన మందులు వాడడం వల్ల మన శరీరంలో సహజంగా ఆహారం ద్వారా తయారయ్యే రోగనిరోధక శక్తిని మన శరీరం పూర్తిగా కోల్పోతుంది.తద్వారా రోగం నయమైనా మనిషి పూర్తీగా ఆరోగ్యవంతుడిగా కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది.

…. ఫార్మా శ్యూటికల్ కంపెనీ లు మనదేశంలోనే ఎక్కువ :

అమెరికా కంటే మనదేశంలోనే ఈ మందుల తయారీ కంపెనీలు ఎక్కువున్నట్టు తెలుస్తోంది. ఇది ఒక రకంగా ఔషదాల తయారీ పరంగా మనం పురోగతి చెందడం మంచి పరిణామమే కావచ్చు. కానీ ,ఈ విచ్చలవిడి మందుల తయారీ కంపెనీల వల్ల ఎంత మటుకు నాణ్యమైన ఔషదాల ఉత్పత్తి జరుగుతూ వున్నదనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న! ఇండియా లో సుమారు 2,500 నుండి 3,000 వరకూ ఈ ఫార్మ కంపెనీలు వున్నాయి.us. ఎఫ్ డీ ఏ ఆమోదం పొందినవి ( చిన్న,మధ్యస్థ,పెద్ద, బహుళ జాతి కంపెనీలు తో సహా) 262 కంపెనీలు వున్నాయి. ప్రపంచంలోనే జనరిక్ ఔషదాల డిమాండ్ లో 20 శాతం మన దేశం నుంచే సరఫరా అవుతున్నది అంటే ఆశ్చర్యం వేయకమానదు. దీనికి ప్రధాన కేంద్రం కూడా హైద్రాబాద్ కావడం గమనార్హం. ఒక్క హైదరాబాద్ లోనే 100 కంటే ఎక్కువ ఫార్మా కంపెనీలు వున్నట్టు తెలుస్తోంది. అందుకే హైదారాబాద్ ఫార్మా రాజధాని గా మారింది. 2025 సంవత్సరం నాటికి ఫార్మా రంగం విలువ 4.7 లక్షల కోట్లు ( సుమారు 55 బిలియన్ డాలర్లు )

… నకిలీ మందుల తో మాఫియాకు కాసుల వర్షం..రోగులకు ప్రాణ సంకటం :

చాలా బాధాకరమైన విషయం ఏంటంటే… నకిలీ మందుల తయారీలో ప్రపంచంలోనే ఇండియా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండవ స్థానంలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. నకిలీ మందుల తయారీలో భారత 53 పర్సెంట్ అయితే, చైనా 30 పర్సెంట్ కలిగివుంది. ఈ నకిలీ మందుల తయారీ కూడా ముఖ్యంగా ఉత్తర రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ,ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, లలో జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దీనితో పాటుగా హైదారాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ నకిలీ మందుల తయారీ కేంద్రాలున్నట్టు గుర్తించారు. ఈ నకిలీ మందుల్లో ఎక్కువగా హార్ట్, షుగర్, పెయిన్ కిల్లర్, యాంటీ అలర్జీ, విటమిన్ డీ. క్యాల్షియం మాత్రలు ఎక్కువగా వున్నట్టు వెల్లడయ్యింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ల ( ఆన్ లైన్ ఫార్మసీ ల) ద్వారా ఈ నకిలీ పంపిణీ జరుగుతోందని తేల్చారు.దీన్ని బట్టి మన పాలక వ్యవస్థ లో ఎన్ని లోపాలు ఉన్నాయో, మన వైద్య వ్యవస్థలోని లోపాలను బట్టి చూస్తే మనకు అర్థం అవుతుంది.!

… ఇంతకీ ఔషధ, డ్రగ్స్ నియంత్రణ అధికారులు ఎక్కడ..?

ఇంత విచ్చల విడిగా ఒక వైపు డ్రగ్స్, మరో వైపు నకిలీ మందులు తో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంటే దేశంలోని, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఔషధ, డ్రగ్స్ నియంత్రణ అధికారులు ఏం చేస్తున్నట్టు ? అనే ప్రశ్న ఎవరికైనా ఏదో సందర్భంలో తలెత్తుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఔషధ, డ్రగ్స్ నియంత్రణ, మాదక ద్రవ్యాల నియంత్రణ కట్టడికి 11 డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చి, అక్రమ మందుల నియంత్రణకు మరో ముందడుగు వేశామని చెబుతోంది. ఆయినా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా వున్నాయి. ఏపీ లో డ్రగ్స్ ను, గంజాయి ని కంట్రొల్ చేశామని అసెంబ్లీలో హోం మంత్రి గారు ప్రకటన చేసిన మరుసటి రోజే మదనపల్లె లో ఒక గంజాయి కేసు వెలుగు చూసింది. ఇలా వెలుగులోకి రాని కేసులు ఇంకా ఎన్ని వుంటాయో తెలీదు. ప్రభుత్వాలు ఈ నకిలీ మందులు,గంజాయి, డ్రగ్స్ ను ఉక్కు పాదం తో అణిచివేయాలంటే ముందు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా చిత్త శుద్ధి ని కలిగి ఉంటే తప్ప, అది సాధ్యం కాదనేది అక్షర సత్యం. దీంతో పాటు ప్రతి జిల్లాలోనూ డ్రగ్స్ కంట్రోల్ నియంత్రణ కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తెలంగాణలో 22 జిల్లాల్లో సెంటర్ మెడిసిన్ స్టోర్ లను ప్రభుత్వమే యేర్పాటు చేస్తోంది. అంటే నకిలీ మందులు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ రేటుకే మందులు రోగులకు అందుబాటులో ఉంటాయనేది ప్రధాన ఉద్దేశం. అదే తరహాలోనే మన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రభుత్వ మెడిసిన్ స్టోర్ లను ఏర్పాటుచేసి, నకిలీ మందుల తయారీ కి ప్రభుత్వం కళ్లెం వేసి, మెడికల్ మాఫియా పై ఉక్కు పాదం మోపేలా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పై ఉంది. లేని పక్షంలో ఈ మెడికల్ మాఫియా పై ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో భారత కమ్యునిస్టు పార్టీ ముందు వరుసలో వుంటుంది. ఆ రకమైన ప్రజా ఉద్యమాలు ను ఎదుర్కోవడానికి మీ పాలక పక్షాలు సంసిద్దులై వుండక తప్పదు…!!!!!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments