స్వాతంత్ర సమరయోధుడు నల్ల కన్ను. మరణం తీరని లోటు
దేశంలోనే అత్యంత సీనియర్ కమ్యూనిస్ట్ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త, ప్రజా జీవితంలో శాశ్వత నైతిక శక్తి కలిగిన ఆర్. నల్లకన్ను గారు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి తీవ్ర సంతాపాన్ని వ్యక్త పరుస్తున్నది.ఆయన మరణం భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో మరియు కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో ఒక శకానికి ముగింపు పలికింది. కామ్రేడ్ ఆర్. నల్లకన్ను గారు 1925 డిసెంబర్ 26న ప్రస్తుత తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలోని తిరువైకుంటంలో...