Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 12:23 pm Editor : Admin

బడ్జెట్లో బీసీలకు న్యాయం జరిగేంత వరకు శాసనమండలిలో పోరాడుతాం ఎమ్మెల్సీ సత్యం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

బడ్జెట్లో బీసీలకు న్యాయం జరిగేంతవరకు శాసనమండలిలో పోరాడతా

*ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రకటన*

నేటి సత్యం హైదరాబాద్ ఫిబ్రవరి 27

గత ప్రభుత్వాల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా బడ్జెట్లో బీసీలకు సరైన న్యాయం చేయకపోవడం శోచనీయమని అందుకొరకు బడ్జెట్లో బీసీలకు సరైన న్యాయం దొరికేంతవరకు శాసనమండలిలో పోరాడతా అని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు

హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు బిసి పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహారదీక్ష శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ…

బీసీలవి న్యాయమైన కోరికలేనని ఎన్నికల సందర్భంగా పాలకులు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమంటున్నారే తప్ప గొంతెమ్మ కోరికలు ఏమీ కోరటం లేదని గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు ఇచ్చిన 21 హామీలను నెరవేర్చాలని మాత్రమే బీసీలు కోరుతున్నారని అందువల్ల ఈ బడ్జెట్ లో అందుకు సంబంధించిన నిధుల కేటాయింపు చేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా చేతివృత్తుల వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని సంచార జాతుల వారికి కేటాయించిన బడ్జెట్ కు సరిపడే నిధులు విడుదల చేయాలని,గత బడ్జెట్ లో బీసీ లకు కేటాయించిన నిధుల పట్ల శ్వేత పత్రం విడుదల చేయాలని,ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన అమానవీయ సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు

*బీసీలకు న్యాయం జరగాలంటే*

*ఐక్య ఉద్యమాలు నిర్వహించడమే మార్గం*

*బీసీ హక్కుల సాధన సమితి ధనుంజయ నాయుడు వ్యాఖ్య*

బీసీలకు జనాభా దామాషా ప్రకారం సమన్యాయం దక్కాలంటే ఐక్య ఉద్యమాలు ఒకటే మార్గమని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు

తరతరాలుగా దశాబ్దాల తరబడి బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అణచివేతకు గురవుతున్నారని అందుకు కారణం బీసీల మధ్య ఐకమత్యం లేకపోవడం బీసీ ఉద్యమాలు కూడా ఎన్నెన్నో దారులలో ఎన్నెన్నో తీరులలో నడవడం వల్ల బీసీ ఉద్యమాలను పాలకులు బలహీనపరిచే క్రమంలో ఒక్కో బీసీ ఉద్యమం పాలకులకు వత్తాసుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని అందువల్ల బీసీ ఉద్యమాలు అన్నీ ఐక్యమై కేవలం బీసీ జాతి కి న్యాయం జరిగే దిశగానే పోరాటాలు కొనసాగించాలని అందుకు బీసీ హక్కుల సాధన సమితి తన సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు

*బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ*

జనాభా దామాషా ప్రకారం మాత్రమే విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో ఆయా కులాల వారికి వారి జనాభా నిష్పత్తి ప్రకారం మాత్రమే రిజర్వేషన్ కల్పించాలని 42% 44% 50% ఇచ్చే బిచ్చాలు మాకు అవసరం లేదని దేశ జనగణన లో కులగణన చేపట్టి ఏ కుల జనాభా ఎంత ఉందో తేల్చి అంతే నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పించి అట్టడుగు వర్గాల వారికి కూడా చట్టసభల్లో ప్రవేశించే వీలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు

కార్యక్రమం లో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ, ప్రమీల, బాపురాజు, చీకటి ప్రసాద్, బొట్ల శ్రీనివాస్, సుర వెంకటేశం మహాలక్ష్మి పాల్గొన్నారు