Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 5:14 pm Editor : Admin

కుమ్మెర మల్లన్న జాతర డిఎస్పి స్పందన




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నాగర్ కర్నూలు జిల్లా….*

*కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై డీఎస్పీ స్పందన*

* నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మరణ ఘటనకు రాజకీయ కోణం జోడిస్తున్నారని డీఎస్పీ ఆరోపణ

* అగ్రవర్ణాలు పసిపాపను తన్నిచంపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం

* కొంతమంది రాజకీయ కుట్రతో సంచలనాలు సృష్టిస్తున్నారని తీవ్ర విమర్శ

* వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

* పోస్టుమార్టం రిపోర్ట్ కీలకమని, దాని ఆధారంగానే నిజాలు వెలుగులోకి వస్తాయని వెల్లడి

* పోలీస్ శాఖ చట్టబద్ధంగా, న్యాయపరంగా పనిచేస్తుందని స్పష్టం

* ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు సమంజసం కాదని హెచ్చరిక

* తన విధుల్లో ఎప్పుడూ పక్షపాతం చూపలేదని డీఎస్పీ స్పష్టం

* యూనిఫామ్‌లో ఉన్న అధికారిపై అసభ్య ప్రవర్తన జరిగినా ఓర్పుతో పనిచేశానని వ్యాఖ్య

* కులం పేరుతో చందాలు వసూలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణ

* చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

* కుమ్మెర ఘటనపై అన్ని స్థాయిల్లో విచారణ కొనసాగుతోందని వెల్లడింపు

* రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కుల సంఘాల నాయకులు ముందడుగు వేయాలని పిలుపు

* వాస్తవాలు ఎప్పటికైనా బయటపడతాయని, నిజం నిర్భయంగా వెలుగులోకి వస్తుందని వ్యాఖ్య..