(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ట్రంప్ కు బానిసగా మారిన మోదీ
ట్రంప్ అందరికన్నా పెద్ద తీవ్రవాది
ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే కేజ్రీవాల్ పై మద్యం కేసు
చంద్రబాబు పై ప్రజా వ్యతిరేకత ప్రారంభం అయింది
పాత్రికేయులతో సీపీఐ జాతీయ నేత నారాయణ వెల్లడి*
రాజమండ్రి, ఫిబ్రవరి28: అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని ట్రంప్ కు మోదీ బానిసగా మారారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ విమర్శించారు చేశారు. ట్రంప్ విధానాలకు సాగిలాపడి ప్రధాని మోడీ బానిసగా వ్యవహరిస్తున్నాడని పేర్కొన్నారు.
శనివారం ఉదయం స్థానిక సీపీఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసి వాళ్లకు కోట్లాది రూపాయలను రుణాలు మాఫీ చేస్తుందన్నారు బ్యాంకులకు తాకట్టు పెట్టిన వారిలో 26 మంది ఉండగా వారిలో 27మంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారిని సుమారుగా వారికి 27 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టారన్నారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ రుణాలను మాఫీ చేస్తుందన్నారు. ప్రపంచానిని కుదిపి వేసిన ఎప్స్తీన్ ఫైల్స్లో మోడీ పేరు రావడంతోనే ఆయన అమెరికాకు సాగిల పడి దేశ పరువు తీసారన్నారు. కార్పొరేట్ల మేలు కోసం అటవీ చట్టాలను మార్పు చేసి అడవి సంపదను వారికి దోచిపెడుతున్నారన్నారు. ఆదివాసికి చెందిన రాష్ట్రపతితో అటవీ చట్టాన్ని మార్పు చేసి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టి ఆపరేషన్ కాగర్ పేరుతో నక్సల్స్ పేరు పెట్టి గిరిజనులను చంపేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీతోనే ఉన్నాయని వీరి పోరాటం రాష్ట్రంలో కూటమి, వైసీపీలుగా ఉన్నా ఢిల్లీలో మాత్రం కలిసి ఉంటున్నారని చెప్పారు. బిల్ గేట్స్ను తీసుకువచ్చి అమరావతిలో అరటి తోటలను చూపించిన సీఎం చంద్రబాబు కేంద్రంలో వ్యవసాయ రంగానికి మోసం చేస్తున్న మోడీని మాత్రం నిలువరించడంలో భయపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ భూములను కారు చౌకగా కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఇలా కార్పోరేట్లకు ఊడిగం చేయడంలో మోడీ, బాబు పోటీ పడుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు.
గత ఢిల్లీ ఎన్నికల్లో అమాద్మీ పార్టీ ఓడించి బీజేపీ ను అధికారంలోకి తీసుకు రావడం కోసం మద్యం లిక్కర్ కుంభకోణం అని ఆరోపణలు చేసి కేజ్రీ వాల్, సిసోడియా, కవిత లపై కేసు పెట్టి జైలుకు పంపించారని ఇప్పుడు కోర్ట్ లో సాక్ష్యాలు లేక కేసు కొట్టివేశారని నారాయణ అన్నారు మోదీ పెడరల్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు అమిత్ షా నక్షలిజం
పోతుందని కలలు కంటున్నారని నక్సలైట్లు చనిపోచ్చు కానీ సిద్ధాంతం కు మరణo లేదని ప్రజల మధ్య అంతరాలు ఉన్నంత కాలం కమ్యూనిజం కు చావు లేదని ఆయన గుర్తు చేశారు
రాష్ట్రంలో ఉన్న సమస్యలపై పోరాటం చేసి సీపీఐని బలోపేతం చేస్తామని నారాయణ చెప్పారు.
పాత్రికేయుల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరావు, సహాయ కార్యదర్శి కె రాంబాబు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కె సత్తిబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.