యుద్ధం అంటే… l
యుద్ధమంటే…. బాంబులేస్తే ధ్వంసమైపోయేది రహదారులు భవనాలేనా? అప్పటిదాకా పుల్లా పుడకా ముక్కున కరిచి కట్టుకున్న నాగరీకతలన్నీ పడుతూ లేస్తూ ప్రయోగాలు చేస్తూ దాటొచ్చిన తీరాలన్నీ నెత్తుట్లో తడిసిపోతాయి నడుస్తున్న జీవితాలు నిద్రిస్తున్న బతుకులూ ఒక్క మాట కూడా చెప్పకుండా బీభత్సంగా అంతరించిపోతాయి విధ్వంసానికి మనుషులంటే ఎముకల గూళ్ళే శకలాలు శకలాలుగా పేలి పోతారు ఇళ్ళన్నీ కాటికాపర్లు కరువైన స్మశానాలై భయపెడతాయి కన్నీళ్ళు రక్తంతో తడిసిన రహదార్లు భోరుమంటాయి పంటలు తోటలు బొగ్గుముక్కలైపోయి బావురుమంటాయి యుద్ధమెప్పుడూ మృతదేహాల సేద్యమే...