యుద్ధం వద్దు శాంతి చర్చలు ముందు.
నేటి సత్యం హైదరాబాద్ మార్చి 1
ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా చేపట్టిన దాడులను భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తీవ్రంగా ఖండిస్తోంది. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ పత్రిక ప్రకటన విడుదల చేశారు..
మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా సామ్రాజ్యవాద శక్తులు వ్యవహరించడం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది.
ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఈ దాడుల వల్ల అమాయక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. సమస్యలను సైనిక దాడుల ద్వారా కాకుండా దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్ చర్యలను ఐక్యరాజ్యసమితి తక్షణమే ఖండించి జోక్యం చేసుకోవాలి. భారత ప్రభుత్వం కూడా స్పష్టమైన వైఖరి తీసుకుని శాంతి పరిరక్షణకు కృషి చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది.
శాంతి, సౌహార్దం, ప్రజల జీవన హక్కుల కోసం పోరాడే శక్తులన్నీ ఈ దాడులకు వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని పిలుపునిస్తున్నాం.టి రామకృష్ణ రాష్ట్ర సమితి సభ్యులు శేరిలింగంపల్లి సిపిఐ పార్టీ ఇన్చార్జ్