యుద్ధo వద్దు శాంతి ముద్దు.
యుద్ధం వద్దు శాంతి చర్చలు ముందు. నేటి సత్యం హైదరాబాద్ మార్చి 1 ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా చేపట్టిన దాడులను భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తీవ్రంగా ఖండిస్తోంది. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ పత్రిక ప్రకటన విడుదల చేశారు.. మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా సామ్రాజ్యవాద శక్తులు వ్యవహరించడం ప్రపంచ శాంతికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు...