భర్త దాష్టీకానికి, కర్కషత్వానికి 4
నెలల గర్భిణి మృతి..
(యస్.పి. మల్లికార్జున సాగర్)
కొల్లాపూర్ మార్చి 3(నేటి సత్యం)
ప్రేమించి పెండ్లి చేసుకున్న నాటి మాటలు మాయమాటలు కాగా ప్రేమించిన నాడున్న ప్రేమ ఆత్మీయత అనురాగాలు గాలిలో కలిసి మాయమై పోగా ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త కర్కషత్వానికి తన మాతృత్వాన్ని ఆస్వాదించ కుండానే నాలుగు నెలల గర్భిణి తన నిండు ప్రాణాలను కోల్పోయి
విగత జీవి గా మారిన ఓ భగ్న ప్రేమికురాలి దురదృష్ట సంఘటన ఇది.
కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామ నివాసురాలు బత్తిని మౌనిక (21) ను, కొల్లాపూర్ మండలం మాధవరావుపల్లి గ్రామనివాసుడైన నాగరాజు తన అమ్మమ్మ ఊరు అయినా రామాపురం గ్రామం లో ఉంటు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
వారి దాంపత్య జీవితం లో వారికి ప్రేమ కు చిహ్నం గా నాగరాజు తో మౌనిక నాలుగు నెలల గర్భిణి అయినది.
కొల్లాపూర్ మండల కేంద్రం లో జమ్మూనిగడ్డ ఎస్సీ వాడలో నివాసం ఉంటున్న మౌనిక కు ఇటీవల అమ్మ తల్లి అంటు వ్యాధి సోకి అస్వస్థతకు గురి కావడం తో భర్త నాగరాజు ఆమెను వైద్యశాలకు తీసుక వెళ్ళి చికిత్సను చేయించాడట.
ఈ క్రమం లో భార్యాభర్తల మధ్య న ఏర్పడిన మనస్పర్ధలు, జరిగిన వాదోపవాదాల మధ్యన నాగరాజు కోపోద్రిక్తుడు అయి నాలుగు నెలల గర్భవతి అయిన తన భార్య మౌనిక ఉదరము పై కాలుతో తన్నినట్లు మౌనిక బంధువులు ఆరోపించారు.
నాలుగు నెలల గర్భిణీ అయిన మౌనిక ను ఉదరము పై నాగరాజు తన్నడం తో అస్వస్థతకు గురైన మౌనిక ను హుటా హుటిన కొల్లాపూర్ పట్టణం లోని ప్రభుత్వ వైద్యశాలకు మంగళవారం ఉదయం తరలించారు.
కానీ అప్పటికే మౌనిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
భర్త నాగరాజు తన భార్య మౌనిక ఉదరము పై కాలి తో తన్నడం మూలం గానే మౌనిక అస్వస్థతకు గురై చనిపోయినట్లు మౌనిక కుటుంబ సభ్యుల ఆరోపించారు.
ఈ మేరకు కొల్లాపూర్ మండల పోలీసులకు మృతురాలు మౌనిక కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం ఫిర్యాదు చేయడం తో నాలుగు నెలల గర్భవతి అయిన మౌనిక మృతదేహానికి వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.