Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 2:24 am Editor : Admin

దారికి అడ్డుగా ఉన్న కానీలు తొలగింపు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

దారికి అడ్డుగా ఉన్న కనీలు తొలగింపు —రంగంలోకి దిగిన ఎమ్మార్వో

గన్నేరువరం, నేటి సత్యం, మార్చి 04:

గన్నేరువరం మండలంలోని గుణుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన గూడెల్లి మల్లేశం అనే రైతు ప్రజావాణిలో తన వ్యవసాయ భూమికి వెళ్లకుండా కొందరు వ్యక్తులు దారికి అడ్డంగా కనిలు అడ్డువేశారని, ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎమ్మార్వో కే కనుకయ్య దారికి అడ్డంగా వేసిన కనిలను రెవెన్యూ అధికారులు బుధవారం తొలగించారు.ఈ దారి గుండా రాకపోకలు సాగించే ప్రజలు, వాహనదారులు కంచెల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే:

గ్రామంలోని సర్వేనెంబర్ 849 ప్రభుత్వ భూములోకి వెళ్లడానికి కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కంచెలు వేసి దారిని మూసివేశారు. దీనిపై ఈరోజు ఉదయం రెవెన్యూ సిబ్బంది స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకున్నారు.

రికార్డులను పరిశీలించి, అది ప్రభుత్వ దారి అని నిర్ధారించిన అనంతరం అధికారుల సమక్షంలో కంచెలను పూర్తిగా తొలగించారు. దారిని ఆక్రమించి కంచెలు వేసిన వారికి హెచ్చరికలు జారీ చేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌.ఐ ( రఘు ) రెవెన్యూ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.