గన్నేరువరం మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత
గన్నేరువరం, నేటి సత్యం, మార్చి 4 :
గన్నేరువరం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి సిపిఐ నాయకుల డిమాండ్
ఇసుక కొరత తీర్చాలి: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సరిపడా ఇసుకను ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఇంటి నిర్మాణానికి 20 నుండి 30 ట్రిప్పుల ఇసుక అవసరమవుతుందని, ప్రస్తుతం టోకెన్లు ఉన్నా ఇసుక అందడం లేదని పేర్కొన్నారు.
ప్రైవేటు దోపిడీ: ప్రభుత్వ సరఫరా లేకపోవడంతో లబ్ధిదారులు ప్రైవేటుగా ఇసుక కొనాల్సి వస్తోందని, అక్కడ అడ్డగోలు ధరలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారుల పర్యవేక్షణ: అధికారులు వెంటనే గ్రామాల్లో పర్యవేక్షించి, నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఇసుక సక్రమంగా అందేలా చూడాలని కోరారు.
రెండో విడత లబ్ధిదారులు: రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారులను తక్షణమే గుర్తించాలని, ‘పరంపోగు’ భూముల సాకుతో ఏళ్ల తరబడి నివసిస్తున్న వారి ఇండ్ల నిర్మాణాలను ఆపవద్దని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ కాంతలా అంజిరెడ్డి,సిపి ఐ మండల కార్యదర్శి చో క్కల శ్రీశైలం, మండల సహాయ కార్యదర్శి లు పి ప్పాల కనకయ్య, కూన మల్లయ్య, గ్రామ కార్యదర్శులు బోయిన మల్లయ్య, మండల నాయకులు ఎండి నాయ్యిమ్, రాపోలు రాయమల్లు, చొక్కాల శ్రీనివాస్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.