ఫీజుల పేరుతో 10వ తరగతి హాల్ టికెట్లు ఆపితే సహించం: AISF ఏఐఎస్ఎఫ్ సరూర్ నగర్ మండల కార్యదర్శి పి. వినోద్ నాయక్ హెచ్చరిక*
నేటి సత్యం ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు నాయక్ : పదో తరగతి వార్షిక పరీక్షల ముంగిట, ఫీజుల బకాయిల పేరుతో విద్యార్థుల హాల్ టికెట్లను నిలిపివేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలల తీరుపై ఏఐఎస్ఎఫ్ ఎఫ్ (ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సరూర్నగర్ మండల కార్యదర్శి పి. వినోద్ నాయక్ వారు మాట్లాడుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
విద్యార్థుల హక్కుల కాలరాప్త: పదేళ్ల కష్టానికి ప్రతిరూపమైన పదో తరగతి పరీక్షల సమయంలో, కేవలం ఫీజుల కోసం హాల్ టికెట్లు ఆపి విద్యార్థులను మానసిక వేదనకు గురిచేయడం అత్యంత దుర్మార్గమని వినోద్ నాయక్ మండిపడ్డారు. ఇది విద్యార్థుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు.
చట్టవిరుద్ధ చర్యలు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఫీజుల పెండింగ్‌ను కారణంగా చూపి విద్యార్థికి హాల్ టికెట్ నిరాకరించే అధికారం ఏ పాఠశాల యాజమాన్యానికి లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హెచ్చరించారు.
క్షేత్రస్థాయి తనిఖీలు: సరూర్నగర్ మండలంలోని ప్రతి ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలో MEO గారు ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించాలి. ఏ విద్యార్థి వద్దనైనా హాల్ టికెట్ ఆపినట్లు తేలితే సదరు యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
హెల్ప్ లైన్ ఏర్పాటు: హాల్ టికెట్ల వేధింపులపై ఫిర్యాదు చేయడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయం (DEO Office) ఒక ప్రత్యేక ఫోన్ నంబర్‌ను లేదా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలి.
గుర్తింపు రద్దు: ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, విద్యార్థులను మానసిక ఆందోళనకు గురిచేసే పాఠశాలల గుర్తింపును (Recognition) వెంటనే రద్దు చేయాలని DEO గారిని డిమాండ్ చేస్తున్నాం.
పోరాట హెచ్చరిక: ఒకవేళ యాజమాన్యాలు తమ పద్ధతి మార్చుకోకపోతే, AISF ఆధ్వర్యంలో ఆయా పాఠశాలలను ముట్టడించి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని వినోద్ నాయక్ స్పష్టం చేశారు.
విద్యార్థులకు విజ్ఞప్తి:
హాల్ టికెట్ల విషయంలో వేధింపులకు గురవుతున్న విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చి AISF ప్రతినిధులను సంప్రదించాలని, అన్యాయంపై కలిసి పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు.
ఇట్లు,