*బీసీల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ డిమాండ్ చేశారు*
నేటి సత్యం ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రతినిధి సక్రు నాయక్:ఈరోజు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సరూర్నగర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో. డిప్యూటీ తాసిల్దార్ భాను గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేయడం జరిగినది
బీసీలు పెద్ద జనాభాలో ఉన్నప్పటికీ, వారికి సమానంగా న్యాయం జరగడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
బీసీలు అన్ని రంగాలలో ఉన్నప్పటికీ, వారు వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకపై జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించి, బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని
కోరారు
బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపుమేరకు మార్చి 20న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు 50,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టాలి.
అట్రాసిటీ చట్టాన్ని బీసీ కులాలకు కూడా వెంటనే వర్తింపజేయాలి.
కేంద్రంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
బ్యాంకులతో సంబంధం లేకుండా, బీసీలకు చెందిన చిన్న వ్యాపారులకు వ్యక్తిగత రుణంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలి కేంద్రం మరియు రాష్ట్రంలో నామినేటెడ్ పదవులలో బీసీలకు 50% రిజర్వేషన్లు కేటాయించాలి
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ZPTC మరియు MPTC ఎన్నికలలో BC లకు 50% రిజర్వేషన్లు కేటాయించాలి
విద్యా హక్కు చట్టం ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల పిల్లలకు ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకురావాలి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి మండల కన్వీనర్ జిల్లాల కృష్ణ ఎండి ఇస్మాయిల్ పాల్గొనడం జరిగింది