Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకావూరు సాంబశివరావు గారి మరణం సమాజానికి తీరని లోటు డాక్టర్ నారాయణ

కావూరు సాంబశివరావు గారి మరణం సమాజానికి తీరని లోటు డాక్టర్ నారాయణ

మాజీ కేంద్ర మంత్రి కావూరి సంబశివ రావు గారి మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడిగా, నైతిక విలువలకు కట్టుబడి పనిచేసిన ప్రజా నాయకుడిగా అందరి గౌరవాన్ని సంపాదించారు.

ఆయన నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. ప్రజా జీవితంలో నిజాయితీ, విలువలతో రాజకీయాలు చేయవచ్చని తన ప్రవర్తనతో నిరూపించిన నాయకుడు. ఆయన సేవలు దేశ రాజకీయాలలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

ఆయన మృతి రాజకీయ రంగానికి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా గాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

– నారాయణ

సీపీఐ జాతీయ నాయకుడు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments