మనుషులు మనుషుల్ని కాలుస్తున్నారు… ఈ ఘోరం ఎవరిది?
అయ్యో........మనుషులు మనుషుల్ని కాలుస్తున్నారు. నేలంతా రక్తంతో నిండిపోతోంది టెహ్రాన్ గోడలు కూలుతున్నాయి కీవ్ మట్టి ఇంకా ఎరుపెక్కుతోంది సూడాన్ బిడ్డలు ఆకలితో ఏడుస్తున్నారు. ఒకడు డ్రోన్ బాంబు వేస్తాడు మరొకడు మిస్సైల్ పేల్చి నవ్వుతాడు అమెరికా-ఇజ్రాయెల్ చేతులు కలిపి ఇరాన్ గుండెల్ని చీల్చేస్తున్నాయి. “స్వేచ్ఛ” అంటూ, “రక్షణ” అంటూ ప్రపంచం మళ్లీ యుద్ధ గీతాలు పాడుతోంది కానీ రక్తం మాత్రమే సత్యం.. మయన్మార్‌లో సైన్యం చంపుతోంది హైతీలో గ్యాంగులు రాజ్యం చేస్తోంది యెమెన్‌లో ఆకాశంలో బాంబులతో నిండిపోయింది...