Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 7:04 am Editor : Admin

పదవ తరగతి పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పదోవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) అమలు: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS.

మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు నారాయణపేట జిల్లా పరిధిలోని 43 పరీక్ష కేంద్రాలలో నిర్వహించే పదోవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సెక్షన్ 163 BNSS (144 సెక్షన్) యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని సూచించారు. అదేవిధంగా ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు ముసివేయాలని సూచించారు. పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు….