(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన పేరి వెంకట్ రెడ్డి కి
*ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం*
నేటి సత్యం మయూరి నగర్
ఈరోజు తేది 14-03-2026నాడు మయూరి నగర్ అసోసియేషన్ కమ్యూనిటీ హల్ లో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమం ఐక్యవేదిక తాత్కాలిక అధ్యక్షులు కే కోటయ్య గారి అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక సభ్యులు అందరు పెద్ద ఎత్తున పాల్గొని పేరి వెంకట రెడ్డి గారు ఉపాధ్యాయ స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి
*తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రిటైరఎంప్లాయిస్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు గా ఏకీగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పేరి వెంకటరెడ్డి గారిని ఘనంగా సన్మానం చేసి ధన్యవాదాలు తెలిపారు*. భవిష్యత్తులో ఇలాగే మంచి పనులు చేస్తూ ఉన్నంత స్థాయికి చేరుకోవాలని అభినందించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ పట్టణానికి వచ్చి కూలీ పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తు మియాపూర్ ఎం ఎ నగర్ లో కుటుంబంతో నివాసం ఉంటూ డ్రైవర్ గా పని చేస్తున్న.శర్మందా గత నెల లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక నుండి వారి కుటుంబానికి 10,000 ఆర్థిక సహకారం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఐక్యవేదిక నాయకులు మరియు మయూరి నగర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.