(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పెట్టుబడిదారీ దోపిడీపై శ్రమజీవి ప్రపంచానికి దిక్సూచి చూపిన మహామేధావి కారల్ మార్క్స్ 134వ వర్ధంతి
టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
నేటి సత్యం శేరిలింగంపల్లి మార్చి14
ప్రపంచ కార్మిక వర్గ విమోచన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా తత్వవేత్త, విప్లవకారుడు కారల్ మార్క్స్ 134వ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.
పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి బహిర్గతం చేసి, శ్రమజీవి వర్గం ఐక్య పోరాటమే సమాజ విమోచనకు మార్గమని ప్రపంచానికి తెలియజేసిన మహానేత కారల్ మార్క్స్ అని. టి.రామకృష్ణ పేర్కొన్నారు. ఆయన రచించిన దాస్ కాపీటల్ ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థలోని దోపిడీ, అసమానతలను శాస్త్రీయంగా విశ్లేషించి ప్రపంచ కార్మిక ఉద్యమాలకు దిశానిర్దేశం చేశారని తెలిపారు.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పని చేస్తూ కార్మికులు, రైతులు, పేద ప్రజల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నాయని సిపిఐ తీవ్రంగా విమర్శించింది. ప్రజా రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో అమ్మకానికి పెట్టడం, కార్మిక చట్టాలను బలహీనపరచడం, ధరల పెరుగుదలను నియంత్రించడంలో విఫలమవడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో కారల్ మార్క్స్ చూపిన మార్గం నేటి శ్రమజీవి వర్గానికి మరింత ప్రాసంగికమైందని సిపిఐ పేర్కొంది. కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు ఐక్యంగా సంఘటితం అయి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను మరింత ఉద్ధృతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.
కారల్ మార్క్స్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సభలు, చర్చలు నిర్వహించి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులు కోరారు.