Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలి

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ఆపాలి

గ్యాస్ ధరలను తగ్గించాలి

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలి

సిపిఐ నారాయణపేటజిల్లా సహాయ కార్యదర్శి  సంతోష్ అధ్యక్షత వహించారు

నేటి సత్యం నారాయణపేట. మార్చి 18

అమెరికా, ఇజ్రాయెల్ ఇరు దేశాలు ఇరాన్ మరియు అరబ్ దేశాల్లోని గ్యాస్, ఆయిల్, ముడి చమురును కా చేయాలనే దురుద్దేశంతో ఇరాన్ దేశంపై అక్రమంగా యుద్ధం చేస్తున్న అమెరికా ఇజ్రాయిల్ జాత్యహంకార చర్యలను మరియు సామ్రాజ్యవాద అహంకారం తో చేస్తున్న యుద్ధం వెంటనే ఆపాలని , ప్రపంచ శాంతిని పరిరక్షించాలని,*సిపిఐ జిల్లా కార్యదర్శి టి నరసింహ* మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సిపిఐ నారాయణపేట జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇరాన్ పై చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా అంబేద్కర్ చౌరస్తాలో ముందు ధర్నా చేసి .

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇదే అదునుగా బావించి గ్యాస్ పై కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని , బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని , గ్యాస్ కొరత, ధరల పెరుగుదలకు బిజెపి ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ నియంతగా వ్యవహరిస్తూ తన ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం, ప్రభుత్వ అధినేతలను ఎత్తుకెళ్లి నిర్బంధించడం, ఇరాన్ పై ఇజ్రాయిల్ తో కలిసి ఏకపక్షంగా దాడులు నిర్వహించి ప్రపంచ సంక్షోభానికి కారణం అవుతున్నా కూడా,భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాను పల్లెత్తు మాట అనకుండా, మన దేశం ఎవరి దగ్గర చమురు కోనాలన్నా,అమెరికా అధ్యక్షుడు అనుమతి తీసుకోవలసి రావడం అమెరికాకు దాసోహమై దేశ స్వార బౌ మాత్యాన్ని మంటగలిపారని, యుద్ధం జరిగినా, కూడా భారతదేశం వద్ద గ్యాస్ మరియు పెట్రోల్ నిలువలు ఉన్నాయని మేకపోతు గాంభీరం చూపెట్టి,ఇప్పుడు ఒకసారి గా ప్రజలపై భారం రుద్దే విధంగా గ్యాస్ ధరలను పెంచడం, హేయమైన చర్య అని,గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర ఒకేసారి రూ, 60 పెంచడం, గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరత ఏర్పడటంతో హోటల్స్ , హాస్టల్స్ మూసి వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని,

ప్రజలు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని , ఇది పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ బాధ్యత రహితమైన విధానాలే కారణమని, కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని బ్లాక్ మార్కెట్ లను వరి కట్టాలని ఆయన అన్నారు,

ఈ కార్యక్రమంలో, జిల్లా కౌన్సిల్ సభ్యులు. టి వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి చెన్నయ్య*

సిపిఐ మద్దూరుమండల కార్యదర్శి. *ఎస్ వెంకటేష్. ఆర్ వెంకటయ్య .అంజప్ప సరోజనమ్మ .నారాయణమ్మ గడ్డపోల రాజు తదితరులు పాల్గొన్నారు*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments