Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogయుద్ధం ఆపాలని.హైదరాబాదులో కమిటీ

యుద్ధం ఆపాలని.హైదరాబాదులో కమిటీ

నేటి సత్యం ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు హైదరాబాద్ లోని మగ్దూం భవన్ లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది.

పశ్చిమాసియ ,మధ్య ప్రాచ్యం లో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టము, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశం లో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో గ్యాస్ కోసం భారీ క్యూలు ఏర్పడుతున్నాయి.

యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో మార్చి 29న చార్మినార్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది.

ఈ సమావేశంలో సిపిఐ జాతీయ నాయకులు కే. నారాయణ, ఈటి నరసింహ, సిపిఐ ఎం రాష్ట్ర నాయకులు డి జీ .నర్సింహరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ చలపతిరావు ,కే. గోవర్ధన్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కే. రమా, హన్వేష్ , ప్రొఫెసర్ పి.ఎల్ వి.,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ విజయ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నిజాం, ఇస్కఫ్ అజీజ్ పాషా,షహబాజ్, హుస్సేన్, సారా మాథ్యూస్, లుబ్నా సర్వత్, ఎస్ . ఏ.రాహుఫ్ జావిద్ షరీఫ్(AAP), రవిచందర్, రజా హుస్సేన్,ప్రబోద సుమేరు , మునీర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments