Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులే

ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులే

ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులే

మున్సిపల్ కార్మికుల మహాధర్నాలో సిపిఐ ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు

ప్రజలకు కష్టం వచ్చినప్పుడు గుర్తుకు వచ్చేది కమ్యూనిస్టు పార్టీ మాత్రమే అని, ఒకప్పుడు కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించేవారే, ఇప్పుడు కష్టసమయంలో కమ్యూనిస్టుల మద్దతు కోరుతున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో జి.హెచ్.ఏం.సి కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్, ఔట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, వారికి కనీస వేతనం కింద ప్రతినెల రూ.26వేలు ఇవ్వడంతో పాటు పర్మినెంట్ కార్మికులకు నాలుగు డిఎలు చెల్లించి, పిఆర్సి వెంటనే ప్రకటించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ‘మున్సిపల్ కార్మికుల మహాధర్నా’ నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతుగా కూనంనేని సాంబశివరావు పాల్గొని, ప్రసంగిస్తూ తాను ఈ ధర్నాకు ఎమ్యెల్యే గా రాలేదనీ, మీలో ఒక్కడిగా వచ్చాననీ అన్నారు. సుమారు 40 ఏళ్ల క్రితమే కొత్తగూడెంలో మున్సిపల్ కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. మున్సిపల్ పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ ఉద్యోగులు సమానంగా పని చేస్తారనీ, వారికి వేలల్లో జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వాలు, వీరికి మాత్రం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఆరోగ్యాలను, ప్రాణాలను పణంగా పెట్టి వారి కంటే ఎక్కువగా కష్టపడుతున్న కార్మికులకు కనీస వేతనం లేకపోవడం దారుణమన్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్, సింగరేణి కార్మికులు, కూరగాయల విక్రేతలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు ఓటు వేయడం వలనే తాను ఎమ్యెల్యే గా గెలిచానని చెప్పారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం మేయర్ పీఠాన్ని సిపిఐ కైవసం చేసుకుందని, ఆటో డ్రైవర్ మేయర్ చేశామని తెలిపారు. అది కమ్యూనిస్టు పార్టీకి కార్మికులకు, పేదవాడికి ఉన్న అనుబంధం అని చెప్పుకొచ్చారు. ‘మాకు అధికారం, పదవులే కావాలనుకుంటే, కమ్యూనిస్టు పార్టీలో ఎందుకు ఉంటాం. వేరే పార్టీలకు వెళ్లరాదా? అందరూ పదవులే కొరుకుంటే పేదవాడి గురించి మాట్లాడేది ఎవరు? ఎర్రజెండా ఎప్పటికీ మారదు. ఎర్రజెండా పుట్టిందే పేదవాడి కోసం. కాబట్టి ఎర్రజెండాను మనం కాపాడుకోవాలి. 1920లో ఎఐటియుసి జెండా కార్మిక వర్గం కోసమే పుట్టింది. ఆ తర్వాత 1925లో కమ్యూనిస్టు పార్టీ పుట్టింది’ అని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మీ సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తానని, ముఖ్యమంత్రి రేవంత్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తానని కార్మికులకు హామీ ఇచ్చారు. మీ వెంట ఎర్రజెండా ఎప్పటికీ ఉంటుందని, పోరాటాలు చేసి, హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు. కార్మికులకు పోరాటాల సమయంలో కమ్యూనిస్టుల మద్దతు కావాలి కానీ, ఎన్నికల సమయంలో మాత్రం ఇతర పార్టీలకు ఓటు వేస్తున్నారనీ, అదే ఓటు సిపిఐకి వేసి మనల్ని మనం గెలిపించుకుంటే, రాజకీయ అధికారం మనకే దక్కుతుందని, అప్పుడు మన సమస్యలు మనమే పరిష్కరించుకోవచ్చు అని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎండి. యూసుఫ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సఫాయి పనులు ఆపేసి, సమ్మెకి వెళ్తామని హెచ్చరించారు. అలాగే 60 సంవత్సరాలు దాటిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు మరణించిన కార్మికునికి దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ. 50 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్ రాజ్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలను రద్దు చేసి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే రవిచంద్రన్, ప్రధాన కార్యదర్శి కే ఏసురత్నం రాష్ట్ర కార్యదర్శులు, వనంపల్లి జైపాల్ రెడ్డి, కాంతారావు, హరినాథ్ రావు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ, ఏఐటీయూసీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఓమయ్య, విలాస్, పళ్ళ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, నారాయణరెడ్డి, ధర్మరాజు, సారంగపాణి, బోట్ల బిక్షపతి, శ్రీనివాస్, టి ఆనంద్, చందు, వినయ్, చంద్రమోహన్, సురేష్, శ్రీకాంత్, రాయపూడి శ్రీను, కిషోర్, లడ్డు లాల్, జంగయ్య, సంజీవ, సంతోష, లక్ష్మి, అండాలు, కమల, ఎల్లమ్మ, మహేశ్వరి, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments