Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 12:35 pm Editor : Admin

ప్రభుత్వ పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన..




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ప్రభుత్వ పథకాల పై ప్రతి ఒక్కరికి అవగహన ఉండాలి..

(యస్.పి. మల్లికార్జున సాగర్) కొల్లాపూర్, మార్చి 24, నేటి సత్యం.

ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయన చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె. లక్ష్మీపతి ప్రజలకు తెలియజేశారు.

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నారాయణ పేట ఆధ్వర్యం లో మంగళవారం అమ్మిరెడ్డిపల్లె గ్రామం లో న్యాయ విజ్ఞాన సదస్సు ను నిర్వహించారు.

ఇట్టి విజ్ఞాన సదస్సుకు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే. లక్ష్మీపతి గౌడ్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే. సురేష్ హాజరయ్యారు.

ఇట్టి న్యాయ విజ్ఞాన సదస్సులో వారు మాట్లాడుతూ వ్యవసాయం అంటే ఆహారం, పశుగ్రాసం, నార, ఇంధనం కోసం మొక్కలను, జంతువులను పెంచడం, భూమిని సాగు చేయడం అని వారన్నారు.

ఇవి మానవ నాగరికతకు మూలమని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతన్న అని, రైతు పంటలు పండించడం, పశుపోషణ, నీటి యాజమాన్యం, సాంకేతికతను వినియోగించుకొని, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలనీ వారు రైతన్నలకు విజ్ఞప్తి చేశారు.

ప్రకృతి వ్యవసాయం చేయడం అట్టి వ్యవసాయం ద్వారా పొందే పంటలు ధాన్యాలు మన అందరి ఆరోగ్యానికే కాదు, భూమికి కూడా మంచిదనీ, రైతులు తమ పంట పొలాల యొక్క భూసార పరీక్షలు చేయించుకొని పంటల బీమా చేయించి, నష్టాలను అధిగమించవచ్చని, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్ వంటివి నీటిని ఆదా చేస్తాయని ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తూ వ్యవసాయంలో అధిక దిగుబడులను తద్వారా ఆర్థిక లబ్బీని రైతులు పొందాలని వారు రైతులకు సూచించారు.

న్యాయ వ్యవస్థలో రాజ్యాంగం ప్రకారం అందరికి సమాన హక్కులు కల్పించడం జరిగిందని, వాటన్నిటిని ప్రజలు రైతులు తెలుసుకొని వాటిని పొందేందుకు తమ వంతుగా కృషి చేయాలని వారు రైతులకు ప్రజలకు సూచించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే. సురేష్ మాట్లాడుతూ మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం, సంస్కరణ) చట్టం ఉందని, ప్రతి మహిళ అక్షరాస్యత మరియు చట్టపరమైన అవగాహన కలిగి ఉండాలని ముఖ్యం గా, సమాజం లోని బలహీన వర్గాలకు హక్కులు, బాల్యవివాహాలు, బాలకార్మిక చట్టాలు, ఆడ పిల్లలకు చిన్న వయస్సులో పెళ్లిళ్లు చేయడం నేరమని ఆయన ప్రజలకు తెలియజేశారు.

మహిళలకు ఎన్నో రక్షణ చట్టాలు ఉన్నాయని, నిత్యవసర సరుకుల చట్టం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి తమ యొక్క రసీదులను జాగ్రత్తపరచుకంటే నష్ట పరిహారం పొందే వెసలుబాటు ఉంటుందని ఆయన రైతులకు వినియోగదారులకు తెలియజేశారు.

వరకట్న వేదింపులు, సఖి సెంటర్, ఓల్డ్ ఏజ్ హోమ్, గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ మరియు వినియోగదారుల హక్కుల రక్షణ అవగాహన మరియు న్యాయపరమైన రక్షణ, చట్టపరమైన అవగాహన, ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలి, అమలు వంటివి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంస్థ ద్యారా పేదవారు 15100 నెంబర్ కి కాల్ చేసి ఉచిత న్యాయాన్ని పొందవచ్చు అన్నారు.

ఇట్టి కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి మహేష్, సురేందర్ నాయక్ హెడ్ కానిస్టేబుల్ మరియు గ్రామ ప్రజలు, వార్డు మెంబెర్స్, ఆశావర్కర్లు పాల్గొన్నారు.