Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogప్రభుత్వ భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు తక్షణమే పాట్టాలి ఇవ్వాలి

ప్రభుత్వ భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు తక్షణమే పాట్టాలి ఇవ్వాలి

ప్రభుత్వ, భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు తక్షణమే పట్టాలివ్వాలి

గుడిసెలను తొలగించాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తాం

నేటి సత్యం హైదరాబాద్ మార్చి 24

పేదలకు చెందాల్సిన భూదాన, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు తక్షణమే పట్టాలను ఇవ్వడంతో పాటు ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5లక్షలు మంజురూ చేయాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాకాకుండా గుడిసెలను తొలగించాలని చూసినా, ఈ భూములను పెద్దలకు ధారదత్తం చేయాలనుకున్నా ప్రతిఘంటిస్తామని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, భూదాన భూముల్లో గుడిసెలు వేసుకున్న నివసిస్తున్న పేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ రాష్ట సమితి ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీలో భాగంగా మంగళవారం ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద మహా ధర్నా నిర్వహించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో వేలాది మంది సిపిఐ కార్యకర్తలు, గుడిసెవాసులు పాల్గొన్నారు.

దద్దరిల్లిన ధర్నా చౌక్‌ ః

సిపిఐ కార్యకర్తలు, గుడిసె వాసుల నినాదాలతో ధర్నా చౌక్‌ దద్ధరిల్లింది. చల్లో అసెంబ్లీ పేరుతో వేలాదిగా తరలివచ్చిన గుడిసె వాసులు ప్రభుత్వ, భూదాన భూముల్లో నివసిస్తున్న పేదలకు ప్రభుత్వ తక్షణమే పట్టాలు ఇవ్వాలని నినందించారు. ఉంటే భూమిపై ఉంటాం లేకపోతే జైళ్లో ఉంటామని వారు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

పేదలకు ఇళ్ల స్థలాలు దక్కేవరకు సిపిఐ విశ్రమించబోదు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్యెల్యే కూనంనేని సాంబశివరావు

ప్రభుత్వ, భూదాన భూముల్లో గుడిసెలు వేసుకున్న నివసిస్తున్న నిరుపేదలకు ఆ స్థలాలు దక్కేవరకు సిపిఐ విశ్రమించబోదనిసిపిఐ రాష్ట్ర కార్యదర్శి , ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం దుండుడుగు చర్యలకు పాల్పడితే అడ్డుకోవడనికి అవసరమైతే సిపిఐ న్యాయకత్వం ఆ గుడిసెల్లోనే నివాసం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గుడిసెలవాసుల పోరాటం వృద్ధా కాబేదని, ఏ లక్ష్యంగా కోసం చలో అసెంబ్లీకి తరలి వచ్చారో వారి ఆశయాలన్ని ఎర్రజెండావెలుగులో అన్ని సాధించబడుతాయని స్పష్ట్రం చేశారు. పేదవాడికి ఎర్ర జెండాకు ఉన్న అనుబంధాన్ని ఎవరూ వీడదీయలేరని, కష్టం వస్తే పేదలకు కాదు, ఇప్పుడు మేధావులకు , ధనికులకు కూడ ఎర్రజెండాయే గుర్తు వస్తోందన్నారు. నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిదే భూమి కోసం, భూక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసమన్నారు. 5వేల మంది రక్త తర్పణంతోనే ఈనాడు మనం అనుభవిస్తున్న తెలంగాణ అన్నారు. లక్షలాది ఎకరాల ప్రభుత్వ, భూదాన భూములను భూదోపిడిదార్లు కొల్లగొట్టిన భూములను ప్రభుత్వ తిరిగి స్వాధీనం చేసుకుంటే రెండు, మూడు బడ్జెట్లకు సరి పోను నిధులు సమకూరుతాయని పేర్కొన్నారు. ప్రజా పాలన అంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల సంతోషాన్ని కాకుండ వారితో కన్నీళ్లు పెట్టించడం సరి కాదన్నారు. భూమి కోసం కమ్యూనిస్టులు చేస్తున్న భూ పోరాటం స్ఫూర్తితోనే వినోదాభావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారని, ఆ భూములు పేదలకు దక్కాల్సిందేనన్నారు. ఈ భూముల్లో వేసుకున్న గుడిసెవాసులకు తక్షణమే పట్టాలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు.

సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ః

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి తన వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంపిణీ చేయడం ద్వారా సూర్తితో భూదాన ఉద్యమం ద్వారా సేకరించిన లక్షలాది ఎకరాల ఆ భూములు పేదలకు దక్కాల్సిందేనని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం పేదల గుడిసెలను తొలగించేందుక యత్నిస్తే సిపిఐ సహించబోదని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలు దక్కేంతవరకు ఇంటే భూమిపై లేకపోతే జైళ్లుకైనా సిద్దమన్నారు. ప్రభుత్వం కేసులు పెట్టినా, లాఠీ ఛార్జీలు చేసినా అదిరేది బేదిరేది లేదని పేర్కొన్నారు. సిపిఐ అధ్వర్యంలో గుడిసెలే వేయకపోతే ఇప్పటికే మరిన్ని ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యేవన్నారు. ప్రభుత్వ , భూదాన భూములు గుడిసెలు వేసుకుంటే తొలగిస్తున్న ప్రభుత్వం అదే బడా బడ రాజకీయా నాయకులు, కార్పొరేట్‌ శక్తులు ప్రభుత్వ, భూదాన, చెరువు శిఖం భూములను కొల్లట్టిన వారి జోలికి మాత్రం వెళ్లడం లేదన్నారు. నగరానికి బతుకు దెరువు కోసం వచ్చిన నిరుపేదలకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వానికి కూడ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.. అందుకే ఓడిపోయిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇదే వైఖరి అవలంభిస్తే అదే గతి పడుతుందన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల కేటాయింపులు పారదర్శకంలోపించిందన్నారు. కేవలం కాంగ్రెస్‌ కార్యకర్తలు మాత్రమే ఇళ్లను కేటాయిస్తున్నారని వెంటనే ఆ పద్దతి మార్చుకోవాలని అర్హులైన పేదలకు ఇళ్లను కేటాయించాలని లేకపోతే గ్రామ సభల్లో ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. అదేవిధంగా ప్రభుత్వ , భూదాన భూముల్లో గుడిసెలువేసుకున్న నిరుపేదలు ముఖ్యమంత్రి ప్రత్యేక కోటా కింద ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

గుడిసెలో ఉంటుందా పేదవాళ్ల కాదా తేల్చేందుకు సబ్‌ కమిటీ వేయండి ః ఇటి నరసింహా

మురికివాడల చట్టం ప్రకారం మూడేళ్లగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు చట్ట ప్రకారం కనీసం సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటి నరసింహా స్పష్టం చేశారు. పొట్ట కూడి కోసం కడుపు చేత పట్టుకుని నగరాలకు వలస వచ్చిన నిరుపేదలు గజం స్థలం కొనలేక, ఇళ్ల కిరాయి కట్టలేక కనీసం సౌకర్యాలు కూడ నోచుకోకుండ గుడిసెలు వేసుకున్ని నివసిస్తున్నారన్నారు. గుడిసెల్లో నివసిస్తున్నవారు పేదలు కాదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఏకవేళ అనుమానం ఉంటే తక్షణమే సబ్‌ కమిటీ ఏర్పాటు చేసి ఆ సభ్యులను గుడిసెల్లో మూడు రోజు పాటు నివసించాలని ఆదేశించి తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చాని సూచించారు. హైదరాబాద్‌ మహానగరంలో 5లక్షలకు పైగా గుడిసెలు వేసిన చరిత్ర సిపిఐదన్నారు. పేదలకు న్యాయం చేయకపోతే రాబోచే మూడు కార్పోరేషన్ల ఎన్నికలతో సిపిఐ తన సత్తా ఏమిటో చూపుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

భూ పోరాటాలు సిపిఐకి కొత్త కాదు ః సిపిఐ ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం

ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని భూ పోరాటాలు సిపిఐకి కొత్త కాదని, వాటిని సాధించుకునేవరకు ఉద్యమిస్తునే ఉంటుందని సిపిఐ ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం స్పష్టం చేశారు. పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించేందుకు అనేక కుట్రలు చేసినా, చివరికి తగలబెట్టినా అదరక బేదరక దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 80 ఏళ్లు గడుస్తున్నా పేదవాడికి ఉండడానికి ఇళ్ల లేకపోవడం ఈ ప్రభుత్వాలు సిగ్గు పడాలాన్నారు. పేదల ఇళ్లకోసం అనేక అకాంక్షలను విధిస్తున్న ప్రభుత్వం అదే బడాబాబుల ప్రభుత్వ భూములను కబ్జా చేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నా అటు వైపు కన్నేతి చూడడం లేదన్నారు. అక్రమణ పేరుతో పేదల మధ్య తరగతి ఇళ్లను తొలగిస్తున్నా హైడ్రా అదే పెద్దలు నిర్మాణాలను జోలికి వెళ్లడం లేదన్నారు. గుడిసెల వాసుల పట్టాల కోసం శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు ప్రజా ఉద్యమాలను నిర్మిద్దామన్నారు.

ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు ఎర్రజెండా దించేది లేదు ః చాడ వెంకటరెడ్డి

పేదలు గజం స్థలం కోసం ఏళ్ల తరబడిగా పోరాటాలు చేయాల్సి వస్తోందని, దానిని సాధించుకునే వరకు ఎర్రజెండా దించేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బంగారు తెలంగాణ అంటే & బతుకు తెలంగాణ కావాలని నినదించిన ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. సమాజిక సర్వే చేపట్టిన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ మాట్లాడుతూ ప్రభుత్వం మాటాలు ఒక్కటి, చేతలు మరొక్కటి ఉంటున్నాయన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వం మరి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్న వారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇందిరమ్మఇళ్ల కేటాయింపులపై ప్రభుత్వం తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ, భూదాన భూములు గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వడంతో పాటు గతంలో పట్టాలిచ్చిన నిరుపేదలకు ప్రభుత్వం ఆ స్థలాలను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి ఉమా మహేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలకు 10 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. తక్షణమే ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోతే రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అవసరమైతే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సిపిఐ పని చేయడానికి కూడ వెనకడబోదని హెచ్చరించారు. సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్‌ మాట్లాడుతూ ప్రజలు జీవించడం మంటే వారికి కనీస సౌకర్యాలైన గూడు గుడ్డ ,విద్య, వైద్యం ఉండాలని వీటిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. ఈ సౌకర్యాల కోసం అవసరమైతే ఆలాంటి ఉద్యమాలకైనా, త్యాగాలకైనా సిపిఐ వెనకడబోదని స్పష్టం చేశారు. సిపిఐ హనమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, వరంగల్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ బాషామియా మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్లు నిర్మించి స్తారన్న వాగ్ధానాన్ని నమ్మి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కేవలం రెండు స్థానాలు మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్‌ గెలుపొందండంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్రచారి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా కూంట్లూరులో 70 ఎకరాల భూదాన భూముల్లో 8 వేలమంది నిరుపేదలు గుడిసెలువేసుకుని నివసిస్తుంటే కనీసం అవసరాలపై మంచినీరు, విద్యుత్‌, కూడ కల్పించకోపోగ , దాతల సహకారంతో సోలార్‌ను దీపాల కింద విద్యార్థులు చదువుకుంటుటే దానిని కూడ అధికారులు ఒర్వలేక అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పట్టాలు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల సభ్యులు రామస్వామి, తెలంగాణ రాష్ట్ర మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎన్‌.జ్యోతి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments