బయలు వీరభద్ర స్వామికి ప్రదోషకాల అభిషేకం
నేటి సత్యం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం *బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం* లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (24.03.2026) సాయంకాలం శ్రీశైలక్షేత్ర పాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేషపూజలను జరిపించనున్నది. ప్రతీ మంగళవారం మరియు అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహించబడుతున్నాయి. బయలువీరభద్రస్వామివారు శివభక్తగణాలకు అధిపతి. అదేవిధంగా శ్రీశైలక్షేత్రపాలకుడుగా క్షేత్రానికి ఆరుబయట ఉండి, ఎటువంటి ఆచ్ఛాదన, ఆలయం లేకుండగా బయలుగా దర్శనమిస్తాడు కనుక ఆయనకు బయలువీరభద్రస్వామి అని పేరు వచ్చింది. ప్రసన్నవదనంతో కిరీట మకుటాన్ని...