Neti Satyam
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 1:22 pm Editor : Admin

తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం మార్చి 25.తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు — అపోహలు నమ్మొద్దని పోలీసుల సూచన*

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తల కారణంగా ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తుండటంతో కొన్ని చోట్ల తాత్కాలికంగా రద్దీ ఏర్పడుతోంది. అయితే ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని తెలిపింది.

తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కూడా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో ఇంధన కొరత లేదని పేర్కొంది. అపోహలతో అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయవద్దని, ఇది ప్రమాదకరమని హెచ్చరించింది.

పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ:

* తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు

* అవసరమైనంత మాత్రమే ఇంధనం తీసుకోండి

* అనవసర రద్దీ సృష్టించవద్దు

* భద్రతా నిబంధనలు పాటించండి

అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలిపారు.