Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 7:03 am Editor : Admin

దళితులపై నేటికి దాడులు ఆగలేదు…




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం దళిత ఎక్స్ ఎంపీపీ లింగప్ప పై దాడి చేసి తల పగలగొట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన సంజీవరెడ్డి గౌడ, బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్టు చేయాలి.*

*దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక*

ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో చేగుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ లింగప్ప పై కులం పేరుతో దూషిస్తూ రాళ్లతో కొట్టి తల పగలగొట్టి, అడ్డువచ్చిన ఆయన భార్య పెద్ద శాంతమ్మను కాళ్లతో తన్ని, కొడుకు మోహన్ కుమార్ ను దాడి చేసి రక్త గాయాల పాలు చేసిన అదే గ్రామానికి చెందిన సంజీవరెడ్డి గౌడ, బసవరాజప్ప గౌడ లను వెంటనే అరెస్ట్ చేయాలని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక నుండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లింగప్ప ఇంటి ముందు గ్రామ సర్పంచ్ కొడుకు సంజీవరెడ్డి గౌడ ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడంలో భాగంగా గుంతలు తవ్వుతున్న సందర్భంలో నా ఇంటి ముందు స్తంభం పాతడం ద్వారా వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది అవుతుంది కావున కొంత దూరంలో ఐమాక్స్ లైట్ల కోసం గుంతలు తొవ్వండి అని లింగప్ప చెప్పునంతలోనే లింగప్ప పై దాడి చేసి కులం పేరుతో దూషించి రాళ్లతో తల పగలగొట్టి అడ్డువచ్చిన ఆయన కొడుకును భార్యను విపరీతంగా కొట్టడం ను వారు తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం ఈ విషయంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రక్తస్రావంతో ఉన్న లింగప్ప దావకానికి వెళ్లడానికి కారులో బయలుదేరగా కారును అడ్డగించి కారుపై రాళ్లతో విపరీతంగా దాడి చేసి కారు అద్దాలను పగలగొట్టి కారు వెంబడి సైకిల్ మోటార్లతో వెంబడించి వెంబడించి లింగప్పను హత్య చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దళితుడు ప్రశ్నిస్తే న్యాయం కోరితే ఇలాగే దాడులు చేస్తామని తెలియజెప్పే సంకేతాన్ని తెలియచెప్పడానికి భాగంగా లింగప్ప పై దాడి చేశారని ఈ దాడిని, ఈ హత్యయత్నాన్ని ప్రజలు ప్రజాస్వామిక వాదులు దళితులు ముక్తకంఠంతో ఖండించాలని వారు ఒక ప్రకటనలో కోరారు

లింగప్ప పై దాడి చేసిన హత్యాయత్నం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పరిస్థితిని బట్టి చూస్తే లింగప పై మళ్ళీ దాడి చేసే ప్రయత్నాలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అందుకు దళిత లింగప్పకు రక్షణ కల్పించాలని, నిందితులను అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్విరాజ్, మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, దళిత నాయకులు జీర్గల నాగేష్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.