(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విలీనం అంటూ గొప్పలు చెప్పారు..
ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేస్తున్నారు..
(యస్.పి. మల్లికార్జున సాగర్).
కొల్లాపూర్, మార్చి 29.నేటి సత్యం.
తెలంగాణ రాష్ట్రం లో ఆర్టీసీ సంస్థ ను ప్రభుత్వం లో విలీనం అంటూ పాలకులు గొప్పలు చెప్పారు కానీ విలీనం మాటేమో కానీ ప్రస్తుతం ఆర్టీసీ సంస్థలోని కార్మికులను పాలకులు ఇబ్బందులకు ఇక్కట్లకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యం లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లోని కొల్లాపూర్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆదివారం రోజు పెద్ద ఎత్తున ఆందోళన ధర్నాను నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యం లో సమ్మె సన్నాహక చర్యలలో భాగం గా ఆర్టీసీ కార్మికులు కొల్లాపూర్ లోని ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఆదివారం రోజు సభను నిర్వహించారు.
ఈ ధర్నా సభ సమావేశ కార్యక్రమానికి జేఏసీ నాయకులు చైర్మన్ ఈదురు వెంకన్న , వైస్ చైర్మన్ తామస్ రెడ్డి , మరియు కో కన్వీనర్ సుద్దాల సురేష్ , కోశాధికారి యాదయ్య హాజరు అయ్యారు.
ఈ సందర్భం గా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వము ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వము ఆ బిల్లును అమలు చేయకుండా పక్కకు పెట్టి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నదనీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎలక్షన్లలో తమ మేనిఫెస్టోలో ఆర్టీసీ నీ ప్రభుత్వము లో విలీనం మరియు యూనియన్ల పునరుద్ధరణ, వేతన సవరణ బకాయిల చెల్లింపు లాంటి అనేక విషయాలను పొందుపరిచినా వాటిని అమలు చేయడం లో ఏమాత్రం చిత్తశుద్ధి లేక ఆర్టీసీ కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పేస్టు 2 ఎలక్ట్రిక్ బస్సుల స్కీం ను కూడా ప్రైవేటు కార్పొరేట్లకు అప్పజెప్పి ఆ బస్సులకు వచ్చే సబ్సిడీని కూడా ప్రైవేటు కార్పొరేట్లకు ప్రభుత్వం అందిస్తున్నదని దీనివలన ఆర్టీసీ కొనవలసిన ఎలక్ట్రిక్ బస్సులను అన్యాక్రాంతం చేస్తున్నదనీ వారు విమర్శించారు.
ఆర్టీసీ ప్రభుత్వం లో విలీనం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు జేఏసీ పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినా ఆర్టీసీ కార్మికులకు ఏమాత్రం లాభం జరగలేదు అని వారు ఆందోళనలను వెలిబుచ్చారు.
ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనము చేసుకొని ఆర్టీసీ కార్మికుల సంక్షేమ అభివృద్ధి కొరకు కృషి చేయనందుకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ కార్మిక శక్తిని కూడగట్టుకొని సమ్మె నోటీసును ఇవ్వడం జరిగిందని ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు.
దీనిలో భాగం గా జేఏసీ వారు రాష్ట్రం లో ఉన్న అన్ని డిపోలలో పర్యటించి కార్మికులకు వారి సమస్యలను వివరించి సమ్మె సన్నాక చర్యలను ప్రారంభించినదనీ అందులో భాగం గానే కొల్లాపూర్ ఆర్టీసీ డిపోకు రావడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు.
ఈ ధర్నా సమ్మె సన్నాహక సమావేశ కార్య క్రమం లో జేఏసీ నాయకులు రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు ఎంకన్న ,వైస్ చైర్మన్ థామస్ రెడ్డి కో కన్వీనర్ సుద్దాల సురేష్ ,కోశాధికారి యాదయ్య , కొల్లాపూర్ ఆర్టీసీ డిపో జేఏసీ కన్వీనర్ మద్దిలేటి జె ఏ సి నాయకులు రామయ్య, బిచ్చన్న, రాజ గౌడ్, గద్ద కురుమయ్య,జె. వెంకటేష్, ఎం డి. గౌస్, ఎత్తం వెంకటయ్య, కోడెటి ఖాజా, నెల్లికుదురు శేఖర్,గ్యారేజీ సిబ్బంది మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.