(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కొండిగారి రాములు సంతాప సభ గోడపత్రిక ఆవిష్కరణ
*సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి*
నేటి సత్యం చేవెళ్లే మార్చి 29
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే కొండి గారి రాములు సంతాప సభకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని భూపోరాట కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నియోజకవర్గ ఇన్చార్జి కి రామస్వామి హాజరై పార్టీ శ్రేణులతో కలిసి గోడపత్రికను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల కోసం కర్షకుల కోసం రైతుల కోసం ఆహ ర్నిశలు పోరాడిన నిజాయితీగల నాయకుడని కొనియాడారు సామాన్య ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచి అసెంబ్లీలో ప్రజల గొంతుకగా మారిన అరుదైన నాయకుడు అని పేర్కొన్నారు ఇండ్లు లేని నిరుపేదల కోసం భూ పోరాటాలు నిర్వహించి ఎంతోమంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించిన ఘనత అదేవిధంగా భూమిలేని నిరుపేదలకు వేలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడంలో ఆయన చేసి నా కృషి చిరస్మరణీయమని అన్నారు ఈ నెల 31న ఇబ్రహీంపట్నంలోని భరత్ గార్డెన్లో నిర్వహించనున్న కొండి గారి రాములు సంతాప సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కార్మికులకు కర్షకులకు పిలుపునిచ్చారు ఈ సంతాప సభకు ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోణంనేని సాంబశివరావు గారు హాజరవుతున్నారని తెలిపారు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో బాబురావు పెంటయ్య యాదయ్య వెంకటమ్మ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు