Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 12:21 pm Editor : Admin

అమెరికా బానిసత్వంలో తరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం మార్చి 29 అమెరికా బానిసత్వంలో తరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్‌ దేశాలు దాడులను నిరసిస్తూ

కాంగ్రెస్, వామపక్షాలు, టిజెఎస్, ప్రజాసంఘాల యుద్ధ వ్యతిరేక ర్యాలీ, బహిరంగ సభ

అమెరికా బానిసత్వంలో తరిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వగురువు నని చెప్పుకోవడం సిగ్గుచేటాని పలువురు వక్తలు విమర్శించారు.ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్‌ దేశాలు దాడిని నిలువరించేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.యుద్ద వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల యుద్ధాన్ని నిరసిస్తూ చార్మినార్‌ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఐ(ఎం), టిజెఎస్‌, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమెక్రసీ, సిపిఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌, ఉపాధ్యాయ, విద్యార్ధి, యువజన, మహిళా , రైతు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా యుద్ధానికి, అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యుద్ద నివారణకు ప్రధాని చోరవ తీసుకోవాలని శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తూ ముందుకు సాగారు.

ర్యాలీ అనంతరం ఎగ్జిబిషన్‌ మైదానంలో టిజెఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి సిపిఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌.కె.నారాయణ మాట్లాడుతూ సామ్రాజ్యవాద అమెరికా రాక్షసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఎక్కడ సంపద ఉంటే అక్కడ దాడులకు పాల్పడుతూ ఆ దేశాలను హస్తగతం చేసుకునేందుకు యత్నిస్తున్నారని ప్రపంచ దేశాలు ఏకమై దీనిని అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ యుద్ధాన్ని ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు వ్యతిరేకంగా మాత్రం నోరు మెదపకుండా బానిసగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.తక్షణమే యుద్ధ నివారణకు ప్రధాని చోరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ ఏలాంటి కారణం లేకుండానే ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధంతో సామ్రాజ్యవాదం అసలు స్వరూపం ప్రజల ముందు ఆవిష్కృతమైందన్నారు. యుద్ధం పేరుతో మానవత్వ విలువలను ధ్వంసం చేస్తూ అమాయక ప్రజలను అత్యంత అమానవీయంగా చంపడం టెర్రరిజం కాదా అని ప్రశ్నించారు. సీనియర్ కాంగ్రెస్‌ నాయకులు, గ్రంధాలయ పరిషత్ చైర్మన్ ఎండీ. రియాజ్‌ మాట్లాడుతూ ఇరాన్‌ దేశంతో మన దేశానికి అవినాభావ సంబంధా ఉన్నాయని వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యవహరించడం సరికాదన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులు మొదలు పెట్టాగానే కాంగ్రెస్‌ పార్టీ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శాంతి సందేశాన్ని విడుదల చేసిందని తెలిపారు. సిపిఐ(ఎం) జాతీయ పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లాడుతూ యుద్ధానికి వ్యతిరేకంగా బ్రిక్స్‌లో 4 దేశాలు వ్యతిరేకంగా మాట్లాడితే బ్రిక్స్‌కు అధ్యక్షుడుగా ఉన్న ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కనీసం ఖండించే సాహసం కూడ చేయకపోవడం సిగ్గుచెట్టాన్నారు. సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పొటు రంగారావు మాట్లాడుతూప్రపంచ మానవళికి వ్యతరేకంగా జరుగుతున్న ఆ ధర్మ యుద్ధాన్ని తక్షణమే నిలిపి వేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సిపిఐ (ఎంఎల్‌) మాస్‌ లైన్‌ అధికార ప్రతినిధి చలపతి రావు మాట్లాడుతూ గతంలో ఇజ్రాయెల్‌ పాలస్తీనాపై దాడి చేసినప్పుడు ప్రపంచ దేశాలు వ్యతిరేకించకపోవడంతో దానిని ఆసరాగా తీసుకుని ఇప్పుడు ఇరాన్‌పై దాడికి పాల్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇ.టి.నరసింహా, సిపిఐ సీనియర్‌ నాయకులు సయ్యద్‌ అజీజ్‌పాషా, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌, కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహ్మారెడ్డి, ఎన్‌.జ్యోతి, ఎస్‌.ఛాయాదేవి, సిపిఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్‌, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, తాండూర్‌ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్‌, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజు, తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.అంజయ్య నాయక్‌, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వలీఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, కార్యనిర్వహాక అధ్యక్షులు ఎన్‌.శ్రీకాంత్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టా లక్ష్మణ్‌ ఎఐటియుసి సీనియర్‌ నాయకులు బి.వి.విజయలక్ష్మి, అరసం నేతలు కెవిఎల్, జి. చంద్రమోహన్ గౌడ్, నగర సిపిఐ నాయకులు కళ్యాణ్‌, అనిల్‌ కుమార్‌,చెట్టికింది శ్రీనివాస్‌, ఎండిసలీం తదితరులు పాల్గొన్నారు.