Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogప్రభుత్వ భూముల అక్రమాదారులపై చర్యలు తీసుకోండి

ప్రభుత్వ భూముల అక్రమాదారులపై చర్యలు తీసుకోండి

ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి,

కా,, తోట జీవన్న,   జిల్లా కార్యదర్శి,

సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్,   నేటి సత్యం పార్వతీపురం మార్చి 30

ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎమ్ ఎల్) రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న అన్నారు, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని పార్వతీపురం తాహిసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గారైన బీ. నాగరాజు గారికి పార్టీ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడమైనది.

ఈ సందర్బంగా మాట్లాడుతూ,, పార్వతీపురం మున్సిపాలిటీ మరియు మండలములో రెవెన్యూ గ్రామాల్లో ప్రభుత్వ భూములు పెద్దఎత్తున అక్రమణలు జరిగాయాని అన్నారు, ఉదాహరణకు పార్వతీపురం రెవిన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 348/4లో గ్రామచావిడి,1.ఎకరా, 348/5 లో బందెలదొడ్డి 1.ఎకరా, 348/6 లో 4.ఎకరాలు మున్సిపల్ కార్యాలయాలు, సముదాయాలు అన్ని కలిపి ఆరు ఎకరాలు మునిసిపల్ స్థలము ఉన్నది. అందులో మూడు ఎకరాలు ఆక్రమణదారులు ఆక్రమించి వాటికి సంబంధించిన పత్రాలు తారుమారు చేస్తున్నారు. పార్వతీపురం మున్సిపల్ పరిధిలో ఉన్న అనేకమైనటువంటి ప్రభుత్వ చెరువులను ఇప్పటికే అనేకమంది కబ్జాదారులు కబ్జా చేసి చెరువులుకున్న పరిమితులను, సర్వే నెంబర్లను తారుమారు చేసి కబ్జా చేసి ఉన్నారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలలో అనేక మైనటువంటి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమణదారుల పెద్ద ఎత్తున ఆక్రమించి అనుభవించడం జరుగుతున్నది.వీటన్నిటి పైన ప్రజాసంఘాలు అనేక సందర్భాల్లో మండల ఆఫీసర్లకు విన్నవించుకోవడం జరిగింది . మండల తాసిల్దారు వెంటనే ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను, చెరువులను క్షుణ్ణంగా పరిశీలించి ఆక్రమణకు గురైన భూములను చెరువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్)రెడ్ స్టార్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

మండల రెవెన్యూ తాసిల్దారు వారు వీటి పైన చర్యలు తీసుకొని ఎడల వీటిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పార్టీ ఆధ్వర్యంలో లేఖ రాసి ప్రభుత్వ భూములను చెరువులను ఆక్రమించిన వారిపై పీడీ యాక్ట్ పెట్టి అరెస్టు చేసి,చర్యలు తీసుకోవాలని పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బిడ్డక రామ్మూర్తి, బొత్స మోహన్ రావు, గరుగుబిల్లి సూరయ్య, పాడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments