(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భూమి లేకుండా దళితులకు విముక్తి లేదు
*కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను అమలు చేయాలి.*
నేటి సత్యం నాగర్ కర్నూల్ మార్చి 30
— *మారుపాక అనిల్ కుమార్ డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*
నాగర్ కర్నూలు: దళితులకు నిజమైన సామాజిక న్యాయం భూమి పంపిణీ ద్వారానే సాధ్యమని డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ స్పష్టం చేశారు. “భూమి లేకుండా దళితులకు విముక్తి లేదు” అని ఆయన పేర్కొన్నారు. దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) నాగర్ కర్నూల్ జిల్లా రెండో మహాసభ మేకల లక్ష్మీనారాయణ, తప్పెట కిరణ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశం కు ముఖ్యఅతిథిగా హాజరైన డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికీ వేలాది దళిత కుటుంబాలు భూమిలేకుండా కూలి పనులపైనే ఆధారపడి జీవిస్తున్న దుర్భర పరిస్థితి కొనసాగుతోందని అన్నారు. భూమి లేకపోవడం వల్ల దళితులు ఆర్థికంగా మాత్రమే కాదు, సామాజికంగా కూడా వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అసైన్డ్ భూములు పెద్దల చేతుల్లో అక్రమంగా ఉండటం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేదలకు అందకపోవడం తీవ్రంగా విమర్శించారు. భూమి పంపిణీ కార్యక్రమాలు సక్రమంగా అమలు కాకపోవడం వల్ల దళితుల జీవితాల్లో మార్పు రావడం లేదని అన్నారు.ఈ నేపథ్యంలో కోనేరు రంగారావు కమిటీ ఇచ్చిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఆ కమిటీ స్పష్టంగా భూమి సమస్యను పరిష్కరించేందుకు మార్గదర్శకాలు ఇచ్చినా, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.అలాగే, ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు, భూ పంపిణీ వంటి పథకాలు కేవలం ప్రచారానికే పరిమితమైపోయాయని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉండటం వల్ల దళితులకు అవకాశాలు దూరమవుతున్నాయని తెలిపారు..దళితులకు నిజమైన స్వావలంబన, గౌరవప్రదమైన జీవనం కల్పించాలంటే ప్రతి భూమిలేని దళిత కుటుంబానికి సాగుభూమి ఇవ్వాలని, అసైన్డ్ భూముల ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.భూమి సమస్యను పరిష్కరించకుండా దళిత సంక్షేమం గురించి మాట్లాడటం మోసపూరిత రాజకీయమని తీవ్రంగా విమర్శిస్తూ, ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించారు. డి హెచ్ పి ఎస్ రాష్ట్ర రెండో మహా సభలు ఏప్రిల్ 17 ,18 వరంగల్ నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభకు 33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మహాసభల జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ జి రైతు సంఘం నాయకులు సూర్యశంకర్ గౌడ్ బిజ్జా శ్రీనివాసులు రవీందర్ చంద్రమౌళి కొత్త రామస్వామి చిన్నపాక శ్రీను బాల పేరు నరసింహ గిరి ప్రసాద్ కుమార్ కృష్ణ సురేష్ బండి శ్రీను పర్వతాలు చందు తదితరులు పాల్గొన్నారు