గన్నేరువరంలో ఘనంగా వారసంత వేలంపాట..
పంచాయతీకి రూ. 199500,ఆదాయం
గన్నేరువరం,మార్చి 30 (నేటి సత్యం):
గన్నేరువరం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం రోజున వారసంత బహిరంగ వేలంపాట నిర్వహించారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో స్థానిక వ్యాపారస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27) సంబంధించి జరిగిన ఈ వేలంపాటలో [ పాలెపు వీరేశం ] అత్యధికంగా రూ. [199500] పాడి వేలాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సంత వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని తెలిపారు. వేలం దక్కించుకున్న వారు నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుములను మాత్రమే వసూలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యం పి, వో , పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.