లోక కళ్యాణార్థం పంచ మతాలలో పూజాదికాలు
నేటి సత్యం శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం తేది: 30.03.2026 లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు లోక కల్యాణార్థం పంచమఠాలలో ఈ రోజు ( 30.03.2026) ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపించడం జరిగింది. కాగా ఈ రోజు జరిగిన విశేషపూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు. ఈ సంకల్పంలో దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో...