*ప్రజల సమస్యల పరిష్కారానికై ఇంటింటికి సిపిఐ పిలుపు విరాళాలు ఇవ్వండి! పాలమకుల జంగయ్య సిపిఐ జాతీయ సమితిసభ్యులు*
భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ పిలుపుమేరకు ఇంటింటికి సిపిఐ కార్యక్రమం ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గo కొత్తగూడ చౌర లో ప్రారంభించి. కొండాపూర్ వరకు మాస్ క్యాంపెనింగ్ లో పాల్గొన.. కామ్రేడ్ పాలమాకుల జంగయ్య గారు . మాట్లాడుతూ
ప్రజల కష్టాలు పెరుగుతున్న ఈ సమయంలో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. రోజురోజుకీ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు, పేదల బతుకులు కష్టాల్లో కూరుకుపోతున్నా ప్రభుత్వాలు మాత్రం మూగనటకమే ఆడుతున్నాయి. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత గల పాలకులు కార్పొరేట్ శక్తుల ముందు తలవంచి ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత బలపర్చేందుకు సిద్ధమైంది. ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం ఉద్యమాలను ఉధృతం చేయడానికి ఆర్థిక సహకారం అత్యవసరం.
అందుకే ప్రతి కార్మికుడు, రైతు, యువకుడు, మహిళ ముందుకు వచ్చి
“ఇంటింటికి సిపిఐ – ప్రజా సమస్యల పరిష్కారానికి విరాళాలు ఇవ్వండి”
అనే పిలుపునకు స్పందించాలి.
ప్రభుత్వాల వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి:
ధరల నియంత్రణలో పూర్తిగా విఫలం
నిరుద్యోగ సమస్యపై నిర్లక్ష్యం
రైతులకు న్యాయం చేయడంలో విఫలం
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై భారాలు
ఈ దోపిడీ పాలనకు చెక్ పెట్టేది ప్రజల ఐక్యతే. సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలకు బలంగా నిలబడేందుకు ప్రతి ఒక్కరూ విరాళాలు అందించి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ టి రామకృష్ణ. రాష్ట్ర సమితి సభ్యులు శేర్లింగంపల్లి సిపిఐ పార్టీ కార్యదర్శి కే చందు యాదవ్. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు కూన సుధాకర్.సహాయ కార్యదర్శి జెట్టి శ్రీనివాస్. ఏఐటిసి అధ్యక్షులు టి రాములు. ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కె శివకుమార్. కే ఖాసీం ఆఫీస్ పెట్ ఇన్చార్జి బి నారాయణ. టెలికం నగర్ కార్యదర్శి చంద్రమ్మ. రఘు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు