Neti Satyam
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 11:15 am Editor : Admin

ప్రజా సమస్యల పరిష్కార దిశలో ఇంటింటికి సిపిఐ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం తెల్కపల్లి మండల  ఏప్రిల్1

ప్రజా సమస్యల పరిష్కార దిశలో ఇంటింటికి సిపిఐ : బాల నరసింహ

నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో ప్రారంభించిన ఇంటింటికి సిపిఐ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం . బాల నరసింహ హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వాలు ఎన్ని మారుతున్న నేటికీ ప్రజల సమస్యలు , నిరుద్యోగం , అంటరానితనం , అవమానాలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయని ఆయన అన్నారు దేశంలోని బిజెపి ప్రభుత్వం ఈ దేశంలో ఖనిజ సంపదను మొత్తం కొల్లగొట్టి కొంతమంది బడా వ్యాపారవేత్తల చేతిలో కట్టబెట్టిందని , దేశంలో పెరుగుతుంది నిత్యవసర ధరలను నియంత్రించడంలో ఈ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిదని ఆయన అన్నారు , పశ్చిమ ఆసియా లో జరుగుతున్న యుద్ధం విషయం లో ఆయన మౌనాన్ని వీడాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో ఇల్ల స్థలాలు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని , మహిళలకు ఇస్తానన్న 2500 పెన్షన్ తక్షణమే అమల్లోకి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వంని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు నేటి నుంచి ఈనెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రతి ఇంటికి పర్యటించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని రాబోయే రోజులలో సమస్యల పైన పోరాటాలు కొనసాగిస్తామని ప్రజల యొక్క గొంతుకగా ప్రభుత్వాలను నిలదీస్తామని ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ఎర్ర జెండా పోరాడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవులు గౌడ్ తెలకపల్లి మండల పార్టీ కార్యదర్శి రవీందర్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ , సిపిఐ తెలకపల్లి మండల సహకార దర్శి బుగ్గ స్వామి ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు దేశామోని ఆంజనేయులు ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కే. శివకృష్ణ రాయపాకుల శాఖ కార్యదర్శి విష్ణు గౌరెడ్డిపల్లి శాఖకార్యదర్శి నరేందర్ రెడ్డి ఆలేరు శాఖ కార్యదర్శి డి బిచ్చయ మారేడు బిచ్చాలు మారాడు బాల పీరు అనంతపురం కురుమయ్య బాలస్వామి బాలుతదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.