Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 5:23 am Editor : Admin

పారిశుద్ధ్య కార్మికురాలు పై దాడి తీవ్రంగా ఖండించిన జైపాల్ రెడ్డి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి

కార్మికులపై దాడులు అసహ్యం – నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి

నేటి మున్సిపల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి హెచ్చరిక

అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని హసన్ నగర్ చౌరస్తా వద్ద గ్రాండ్ హోటల్ సమీపంలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి జరగడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని బాధితురాలు ఎన్. సత్యమ్మ (55) ను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.వివరాల్లోకి వెళితే, గురువారం ఉదయం సుమారు 5:30 గంటలకు విధుల్లో ఉన్న సత్యమ్మ గ్రాండ్ హోటల్ సమీపంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న సమయంలో చాయ్ కోసం అడగగా, అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై ప్రశ్నించగా, ఆ వ్యక్తి ఆగ్రహంతో కార్మికురాలిపై దాడి చేసినట్లు తెలిసింది.దాడి అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా, అక్కడే ఉన్న శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్‌ఎఫ్‌ఏ) ప్రశ్నించగా తప్పించుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటనపై సత్యమ్మ బహదూర్‌పుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆమె ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ కేసుకు సంబంధించిన ఎమ్మెల్సీ నెంబర్ 10809గా నమోదు చేశారు.ఈ సందర్భంగా వనంపల్లి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులపై దాడులు అసహనీయమని, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేకపోతే అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని కార్మికులంతా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.