Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 6:37 am Editor : Admin

మదనపల్లె తహసీల్దారు కలెక్టర్ కు అటాచ్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మదనపల్లె తహసీల్దారు కలెక్టరేట్ కు అటాచ్, భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు.

మదనపల్లె తహసీల్దారు కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. మదనపల్లె తహసీల్దారుగా పని చేస్తున్న కిషోర్ కుమార్ రెడ్డి పై ఇదివరకే స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీకేటి భూములు, చుక్కల భూములు, మిలిటరీ భూములను వెబ్ లాండ్‌లో ఎక్కించినట్లు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పది రోజుల కిందటే జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ కలెక్టరేట్ కు తహసీల్దారు ను పిలిపించుకుని విచారించారు. ఈ క్రమంలో తహసీల్దారు బ్యాంకు ఖాతాకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు రాష్ట్ర సీసీఎల్ఏ, విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీనిపై ప్రాథమిక విచారణతో కలెక్టర్ నిశాంత్ కుమార్ తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిని కలెక్టరేట్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా తహసీల్దారు వద్ద ఉన్న ప్రభుత్వ సిమ్ కార్డు, రెండు డిజిటల్ కీ లను ఉన్నతాధికారులకు స్వాధీనం చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.