Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 9:32 am Editor : Admin

ఇంటింటి సిపిఐ శంషాబాద్. కు. డాక్టర్. కె.నారాయణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శంషాబాద్ ఏప్రిల్ 6.సిపిఐ ఇంటింటి కార్యక్రమానికి సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్

*డాక్టర్ కె నారాయణ హాజరవుతారు*

ఇంటింటి సిపిఐ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ మరియు జాతీయ సమితి సభ్యులు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య లు మంగళవారం నాడు శంషాబాద్ లో జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి తెలిపారు

ఈరోజు శంషాబాద్ మండల కేంద్రంలోని ఒక హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు

ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిన గొప్ప విప్లవకారుడు అని తెలిపారు

ఆయన ఇంటింటి సిపిఐ కార్యక్రమంలో ఎండను లెక్కచేయకుండా మండుటెండల్లో పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో ఆయన పాల్గొనడం క్రింది శ్రేణి నాయకత్వానికి ఆదర్శం అవుతారని ఆయన తెలిపారు రేపటిఇంటింటికి సిపిఐ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు