(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ‘మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపన’*
ఎయిర్‌పోర్టులపై అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఫీజబులిటి ఉన్న చోట వీటి నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు 3 నెలల్లో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నాం. ఆదిలాబాద్‌లో పెద్ద విమానాశ్రయం నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. సైనిక, పౌరుల అవసరాలకు అనుగుణంగా ఇది ఉంటుంది’’ అని తెలిపారు.