Neti Satyam
Newspaper Banner
Date of Publish : 13 April 2026, 1:27 pm Editor : Admin

మా పార్కు. ప్రజా ఆస్తిని కాపాడుకుందాం.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం శేరిలింగంపల్లి ఏప్రిల్ 13.జెవి కాలనీ పార్క్‌పై అక్రమ ఆక్రమణలు – ప్రజా ఆస్తిని కాపాడాలి!

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ డివిజన్, గచ్చిబౌలి జెవి కాలనీ పార్క్‌పై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను అడ్డుకోవాలని, బీఆర్‌ఎస్ నాయకులు మరియు స్థానిక ప్రజలు ధర్నా చేపట్టారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని శ్రీరామ్ నగర్ డివిజన్ బీఆర్‌ఎస్ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నిర్వహించగా, బీఆర్‌ఎస్ నాయకులు శ్రీ మరబోయిన రవి యాదవ్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ -పార్క్‌లోని ఒక భాగాన్ని డంపింగ్ యార్డ్‌గా మార్చడం, మరో భాగాన్ని వాహనాల పార్కింగ్‌గా వినియోగించడం, పెద్ద పెద్ద భవనాలు తమ బౌండరీ వాల్స్‌ను పార్క్‌లోకి చొచ్చుకురావడం. ఇవి అన్నీ పార్క్‌ను పూర్తిగా ఆక్రమించాలనే కుట్రకు నిదర్శనం అని ఆరోపించారు.

“ప్రభుత్వానికి స్పష్టమైన ఉద్దేశం ఉంది – ఈ పార్క్ భూమిని పెద్ద బిల్డర్లకు అప్పగించి విక్రయించాలనే కుట్ర జరుగుతోంది!” అని తీవ్ర ఆరోపణలు చేశారు.

“ప్రజా ఆస్తి అయిన ఈ పార్క్‌ను కాపాడటం మనందరి బాధ్యత. అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించాలి. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి!” అని గట్టిగా డిమాండ్ చేశారు.

⚠️పార్క్‌ను రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే, బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.