Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 6:55 am Editor : Admin

లోక్ సభ సీట్ల పెంపు అఖిలపక్షాన్ని పిలవాలి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం.లోక్‌సభ సీట్ల పెంపు.. అఖిలపక్ష భేటీ పెట్టాలి: రేవంత్‌రెడ్డి*

* మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్‌ చేస్తూ ఈమేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. లోక్‌సభ సీట్ల పెంపు విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయని చెప్పారు. దీనిపై అఖిలపక్ష భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు వేర్వేరనేది ప్రతి పౌరుడికీ తెలుసని పేర్కొన్నారు. అసెంబ్లీ సీట్లలో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం ఆమోదిస్తుందని వివరించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో.. జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లు పెంచాలని భాజపా చూస్తోందన్నారు.