Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 12:47 pm Editor : Admin

ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం ఏప్రిల్ 14 *మఖ్దూం భవన్‌లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు*

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో గురువారం ఘనంగా వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు చాడ వెంకటరెడ్డి,పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ఈ టి నరసింహ,బి కే ఎం యు జాతీయ కార్యదర్శి నిర్మల్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమావత్ అంజయ నాయక్ తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ, అంబేద్కర్ ఆశయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు.దళితులు, అణగారిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ, నేటికీ సామాజిక అసమానతలు తొలగిపోవాలని పిలుపునిచ్చారు.లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందని చదువుకో.. సంఘటించు.. పోరాడు! అణగారిన వర్గాల గొంతుకగా మారి, అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని సామాజిక విప్లవాన్ని తెచ్చిన మహానేత అంబేడ్కర్. దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు నిర్ణయం సరైనది కాదని, రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వారికి రిజర్వేషన్లు అందాలని పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి రోజు ఆయనకు నివాళులు అర్పించే వారందరూ చిత్తశుద్ధితో ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుద్దాం అని పల్లా వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు.