Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 5:13 am Editor : Admin

ప్రజావాణిలో ఐలాపూర్ వాసుల ఫిర్యాదు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం *ప్రజావాణిలో ఐలపూర్ వాసుల ఫిర్యాదు*

హైదరాబాద్ ప్రజావాణిలోఐలపూర్ గ్రామానికి చెందిన పలువురు బాధితులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కుందూరు ప్రాంతానికి చెందిన ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి, సుమారు 70 గజాల చొప్పున అమ్మకాలు నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు.

అమ్మకాలు చేసి డబ్బులు తీసుకున్న తర్వాత తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ విషయంపై ఇప్పటికే సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.

మొత్తం 52 మంది బాధితులు ఈ ఘటనలో నష్టపోయినట్లు పేర్కొన్నారు. తక్షణమే విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.